Ads
సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా విమానంలో ప్రయాణించాలనే ఆశ ఉంటుంది. అందువల్ల చాలామంది విమానంలో ప్రయాణించే ఛాన్స్ కోసం చూస్తుంటారు. ఇక ఫస్ట్ టైమ్ విమానంలో ప్రయాణం చేయబోయేవారు అందులో ఎలా ఉండాలనే వాటి గురించి తెలుసుకుని ప్రయాణించాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
విమానంలో ప్రయాణించే సమయంలో కొన్ని రకాల పదాలను వాడకూడదు,మాట్లాడకూడదు. ఎందుకంటే అలాంటి పదాలను ఉపయోగించి మాట్లాడటం వల్ల లక్షలలో జరిమానా వేయడమే కాకుండా జైలుకి వెళ్లాల్సి రావచ్చు. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
విమానంలో ప్రయాణించే సమయంలో చాలా మంది సిబ్బందితో మాట్లాడుతారు. అలా వారితో మాట్లాడినపుడు సరదాకి కూడా మేము మద్యం సేవించామని చెప్పి మాట్లాడకూడదు. ఒకవేళ సిబ్బందితో అలా మాట్లాడటం కారణంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. మద్యం సేవించామని సిబ్బందితో చెప్పినప్పుడు మీపై చర్యలు తీసుకుంటారు. తదుపరి వచ్చే ఎయిర్ పోర్ట్ లో వారికి మిమ్మల్ని దించేసే అధికారం కూడా ఉంటుంది. అంతేకాకుండా మీ పైన కేసు పెట్టి 3ఏళ్ల పాటు జైలు శిక్ష, అలాగే లక్ష రూపాయల జరిమానా విధించే హక్కు వారికి ఉంటుంది.
Ads
అందువల్ల సరదాగానే కాకుండా పొరపాటున కూడా మత్తులో ఉన్నామని కానీ, మద్యం సేవించామని కానీ సిబ్బందితో చెప్పకూడదు. అయితే విమానంలో ప్రయాణించే వారు మద్యం సేవించవచ్చు. కానీ దానికి వారి అనుమతి తీసుకోవాలి. అంతేకాని ముందుగానే మందు తాగి విమానంలో ప్రయాణింకూడదు. అలా చేయడం వల్ల మిమ్మల్ని పూర్తిగా విమాన ప్రయాణం చేయడానికి అనర్హులుగా చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే విమానంలో ప్రయాణం చేసేవారు రూల్స్ తెలుసుకుని, చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి.
Also Read: కాలములో “12 ” గొప్పతనము ఏమిటి..? ఇంత ఉందని మీకు తెలీదా..?