బాలయ్య కి, ఎన్టీఆర్ కి ఏమైంది..? బాలయ్యకి ఆ విషయం మీద కోపం వల్లే.. ఇలా…?

Ads

బాలయ్య సీనియర్ హీరో. ఎప్పటి నుండో ఇండస్ట్రీ లో ఉంటూ ప్రేక్షకులని బాలయ్య మెప్పిస్తున్నాడు. మాస్ సినిమాల తో బాలకృష్ణ ప్రేక్షకులని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు బాలయ్య. ఇటీవల వచ్చిన వీర సింహా రెడ్డి తో అందరినీ ఆకట్టుకున్నాడు బాలకృష్ణ. అఖండ సినిమా కూడా బాలకృష్ణ కి పెద్ద సక్సెస్ ని ఇచ్చింది. బాలయ్య సినీ కెరీర్ లో చాలా హిట్స్ ని అందుకున్నారు.

అలానే జూనియర్ ఎన్టీఆర్ కూడా బాలకృష్ణ లాగే నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చారు. అయితే కొన్ని రోజుల నుండి బాలయ్య కి ఎన్టీఆర్ కి పడడం లేదని వార్తలు విపరీతంగా వినపడుతున్నాయి.

Ads

వీళ్ళ ఇద్దరి తీరూ కూడా అలానే కనపడుతోంది. అయితే అసలు బాలకృష్ణకి ఎన్టీఆర్ కి మధ్య గొడవ ఏంటి…? అసలు ఏం జరిగింది అనే విషయాలను చూస్తే.. బాలకృష్ణ ఎన్టీఆర్ ని తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారానికి రమ్మని పిలిచారట. దానికి ఎన్టీఆర్ నుండి ఏ రెస్పాన్స్ కూడా రాలేదు. దీంతో బాలయ్య కి కోపం వచ్చింది. ఇక ఎన్టీఆర్ ని ఆయన పక్కన పెట్టేసారు. ఈ కారణంగానే ఎన్టీఆర్ బాలయ్య మధ్య వార్ జరుగుతోంది. అందుకనే ఎన్టీఆర్ కి సంబంధించిన పార్టీలకి ఫంక్షన్లకి కూడా బాలయ్య రాలేదు.

బాలయ్య ఆర్ ఆర్ ఆర్ సినిమా కి ఆస్కార్ రావడం పై మెచ్చుకున్నప్పుడు కూడా ఎన్టీఆర్ పేరు తీసుకురాలేదు. అబ్బాయి అయినా ఎన్టీఆర్ గురించి ఏమాత్రం ఆయన స్పెషల్ గా చెప్పలేదు. అలానే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేసి ఒక మెట్టు పైకి ఎక్కేసారు. ఎన్టీఆర్ కి ఈ సినిమా మంచి హిట్ ని ఇచ్చింది పైగా విదేశీయులకు కూడా ఎన్టీఆర్ బాగా తెలిసారు. పైగా ఫ్యాన్స్ కూడా అయిపోయారు. ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ కొరటాల సినిమాకి సంబంధించిన ముహూర్తాన్ని ఈ నెల 23వ తేదీన ఫిక్స్ చేసారు. టీం నుండి అప్డేట్ ని కూడా ఇచ్చారు.

Previous articleచైతన్య విషయంలో నాగార్జున చేసిన తప్పు ఏమిటి..? లేకపోతే టాప్ హీరో అయ్యేవాడు కదా..!
Next articleకీరవాణి కి ఆ పేరు పెట్టడానికి వెనుక… ఇంత పెద్ద కారణమా..? అందుకే ఇలా…!