కీరవాణి కి ఆ పేరు పెట్టడానికి వెనుక… ఇంత పెద్ద కారణమా..? అందుకే ఇలా…!

Ads

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా పేరు.. నాటు నాటు పాట మారుమ్రోగి పోతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఆస్కార్ అవార్డు గురించి చర్చించుకుంటున్నారు. నిజంగా ఆస్కార్ అవార్డు రావడం ఎంతో గొప్ప విషయం. ఇది భారతీయ ప్రజలు గర్వపడే విషయము. ఒక తెలుగు పాట కి అంత గౌరవం రావడం ఎంతో మంచి విషయం.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి కి, పాటకి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ కి అవార్డు వచ్చింది.

దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ ని కీరవాణి చంద్రబోస్ ని ప్రశంసిస్తున్నారు. అభినందనలు తెలుపుతున్నారు. కీరవాణి తండ్రి పేరు శివశక్తి దత్త. ఈయన ఈ విషయంపై స్పందించి పలు విషయాలు మీడియాతో పంచుకోవడం జరిగింది. కీరవాణి కి సంబంధించి అనేక విషయాలని ఆయన మీడియాతో మాట్లాడారు. కీరవానికి మూడేళ్లు ఉన్నప్పటినుండి కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం. సంగీతం మీద ఆసక్తి ఉండేదని చెప్పారు. కీరవాణి కి మొదటి గురువు నేనే అని అన్నారు.

Ads

నాకు తెలిసిన సంగీతాన్ని కీరవాణికి నేర్పించానని.. అలా అభివృద్ధి చెందుతూ పైకి కీరవాణి ఎదిగాడు అన్నారు. సంగీతమే నా కడుపుని పుట్టిందని సరస్వతీపుత్రుడని అన్నారు. ఇక కీరవాణి అనే పేరు ఎందుకు పెట్టారు అనే విషయానికి వస్తే… విప్రనారాయణ సినిమాలో “ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన” ఆయనకి ఇష్టమట.

Music Director MM Keeravani

భానుమతి పాడిన ఈ పాటకి సంగీత దర్శకులు సాలూరు రాజేశ్వర రావు. ఒకరోజు ఆయనని కలిసినప్పుడు ఆ పాట ఏ రాగం అని అడిగితే కీరవాణి రాగం అని చెప్పారు. ఆ సమయంలో కీరవాణి తల్లి కడుపుతో ఉన్నారు. అప్పుడే కీరవాణి తండ్రి కూతురు పుట్టినా కొడుకు పుట్టినా కీరవాణి అని పేరు పెడదామని అనుకున్నారట. కొడుకు పుట్టాడు. అమ్మాయి పేరులాగా వున్నా సరే కీరవాణి అని పేరుని ఫిక్స్ చేసేసాను అని శివశక్తి దత్త అన్నారు. ప్రస్తుతం ఆయన పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Previous articleచనిపోయాక కొన్ని మతాల్లో పూడ్చేస్తారు.. దాని వెనుక కారణం ఏమిటి అంటే..?
Next articleఆనాడు బాలయ్య, చిరంజీవి గురించి… అన్నగారు చెప్పింది నిజం అయ్యిందిగా..!