చైతన్య విషయంలో నాగార్జున చేసిన తప్పు ఏమిటి..? లేకపోతే టాప్ హీరో అయ్యేవాడు కదా..!

Ads

శివ సినిమాతో నాగార్జునకి మంచి గుర్తింపు వచ్చింది. పైగా మాస్ హీరో కింద కూడా మారిపోయాడు. నాగార్జున ఒక పక్క క్లాస్ చిరుగా మరో పక్క మాస్ హీరోగా నటిస్తూ వరుస హిట్లని అందుకున్నారు నాగార్జున. నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీ లోకి వచ్చారు.

ఆ తర్వాత తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా నాగర్జున సొంతం చేసుకున్నారు గ్రీకువీరుడుగా మన్మధుడిగా మెప్పిస్తూ వచ్చాడు సోగ్గాడు.

నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా సినిమాల్లోకి వచ్చారు. నాగచైతన్య జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఏ మాయ చేసావే సినిమా లో నటించాడు చైతన్య. ఆ సినిమా చైతన్య కి మంచి సక్సెస్ ని ఇచ్చింది. తర్వాత మాస్ హీరోగా చేయాలని కొన్ని సినిమాలు చేశాడు కానీ డిసాస్టర్స్ గానే మిగిలిపోయాయి. నాగార్జున అప్పుడు నాగచైతన్య కి నీకు సెట్ అయ్యే క్లాస్ సినిమాలు చేయమని చెప్తే కనుక చైతన్య అలాంటి సినిమాలు చేస్తే లవర్ బాయ్ గా మిగిలిపోయేవాడు.

Ads

కానీ ఇప్పుడు రెండు కూడా లేవు. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాల్లో నటించి ఏదో ట్రై చేస్తున్నాడు చైతన్య. కానీ పెద్ద హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు చైతన్య. మరో పక్క అఖిల్ కూడా మంచి సక్సెస్ ని అందుకోవాలని కష్టాలు పడుతున్నాడు. అఖిల్ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేక పోయాడు. నాగార్జున ఇద్దరు కొడుకులు కూడా కెరీర్లో పైకి రావడానికి కష్టపడుతున్నారు ప్రస్తుతం నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మంచి హిట్ ని అందుకోవాలని… సక్సెస్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్న నాగ చైతన్యకి ఈ సినిమా వరంలా మారుతుందా శాపంలా మారుతుందా అనేది చూడాలి. ఒకవేళ కనుక ఈ సినిమా హిట్ అయితే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పైగా నెక్స్ట్ మంచి సినిమాలు కూడా వస్తాయి. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

Previous articleదొంగతనం చేసిన చిరంజీవి, సుధాకర్… ఆ తరవాత ఏం జరిగింది అంటే..?
Next articleబాలయ్య కి, ఎన్టీఆర్ కి ఏమైంది..? బాలయ్యకి ఆ విషయం మీద కోపం వల్లే.. ఇలా…?