రైలు నెంబర్ లో వుండే ఐదు అంకెలు ఏమిటి..? ఇంత అర్ధం ఉందని మీకు తెలుసా..?

Ads

రైలులో ప్రయాణం చేయడం ఎంతో బాగుంటుంది. అందుకే చాలా మంది రైలు ప్రయాణాలని ప్రిఫర్ చేస్తారు. డిసెంబర్ 22, 2010 ఇండియన్ రైల్వేస్ నాలుగు డిజిట్ నెంబర్ నుండి ఐదు డిజిట్ నెంబర్ లోకి మార్చింది. అయితే మరి ట్రైన్ నెంబర్ కి అర్థం ఏమిటి ఆ సంఖ్య దేనిని చూపుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

ఉదాహరణకి అమృత్సర్ న్యూఢిల్లీ శతాబ్ది ఎక్స్ప్రెస్ శతాబ్ది ఎక్స్ప్రెస్, రైలు నెంబర్: 12014

మొదటి సంఖ్య:

ఐదు అంకెల రైళ్లలో మొదటి అంకె

0 – ప్రత్యేక రైళ్ల కి ఉంటుంది (వేసవి ప్రత్యేకతలు, సెలవు ప్రత్యేకతలు ఇతర రైళ్ళకి)
1 – రాజధాని, శతాబ్ది, సంపర్క్ క్రాంతి, గరీబ్ రథ్, దురంతో మొదలైన సుదూర రైళ్లకు ఒకటి ఉంటుంది.
2 – సుదూర రైళ్లకు రెండు అంకె ఉంటుంది. 1తో రైలు నంబర్‌లు అయిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
3 – కోల్‌కతా సబర్బన్ ట్రైన్ కి.
4 – చెన్నై, న్యూఢిల్లీ, సికింద్రాబాద్ మరియు ఇతర మెట్రోపాలిటన్ రైళ్ల కోసం ఈ నెంబర్ ఉంటుంది.
5 – కన్వెన్షనల్ కోచ్‌లు ఉన్న ప్యాసింజర్ రైళ్లకు.
6 – MEMU ట్రైన్స్ కి.
7 – DMU (DEMU) ఇంకా రైల్‌కార్ సేవల కి ఇలా ఉంటుంది.
8 – కరెంట్లీ రిజర్వ్డ్ ట్రైన్స్ కి.
9 – ముంబై ప్రాంత సబర్బన్ ట్రైన్స్ కి ఇలా ఉంటుంది.

రెండవ అంకె:

మొదటి నెంబర్ ని బట్టీ రెండవది ఉంటుంది. ఈ కింద జోనల్ కోడ్స్ వున్నాయి.

0 – కొంకణ్ రైల్వే కి ఉంటుంది.
1 – CR (సెంట్రల్ రైల్వే), WCR (పశ్చిమ మధ్య రైల్వే), NCR (నార్త్ సెంట్రల్ రైల్వే) కి ఉంటుంది.
2 – సూపర్‌ఫాస్ట్‌లు, శతాబ్ది, జన శతాబ్ది మొదలైనవి జోన్‌లతో సంబంధం ఉండదు. అయితే నెక్స్ట్ వచ్చే నెంబర్ అయితే జోన్ కోడ్.
3 – ER (తూర్పు రైల్వే), ECR (తూర్పు మధ్య రైల్వే).
4 – NR (నార్తర్న్ రైల్వే), NCR (నార్త్ సెంట్రల్ రైల్వే), NWR (నార్త్ వెస్ట్రన్ రైల్వే) కి.
5 – NER (నార్త్ ఈస్టర్న్ రైల్వే), NFR (ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే) కి.
6 – SR (సదరన్ రైల్వే ), SWR (సౌత్ వెస్ట్రన్ రైల్వే) కి.
7 – SCR (సౌత్ సెంట్రల్ రైల్వే), SWR (సౌత్ వెస్ట్రన్ రైల్వే) కి.
8 – SER (సౌత్ ఈస్టర్న్ రైల్వే), ECoR (ఈస్ట్ కోస్ట్ రైల్వే) కి.
9 – WR (పశ్చిమ రైల్వే), NWR (నార్త్ వెస్ట్రన్ రైల్వే), WCR (పశ్చిమ మధ్య రైల్వే) కి.

Ads

 

మొదటి అంకె మూడు అయితే:

కలకత్తా సబర్బన్ మొదటి అంకె మూడు తో మొదలవుతుంటే జోన్లని బట్టీ రెండవ అంకె ఉంటుంది. ER (తూర్పు రైల్వే) కి 30xxx నుండి 37xxx వరకు, SER (సౌత్ ఈస్టర్న్ రైల్వే) కి 38xxx నుండి 39xxx ఉంటుంది.

మొదటి అంకె 4 అయితే:

ముంబై కలకత్తా కాకుండా మిగిలిన సబర్బన్ ట్రైన్స్ కి అయితే

40xxx నుండి 44xxx: చెన్నై సబర్బన్ రైళ్లు
45xxx నుండి 46xxx: ఢిల్లీ సబర్బన్ రైళ్లు
47xxx : సికింద్రాబాద్ సబర్బన్ రైళ్లు
48xxx నుండి 49xxx: రిజర్వ్ ట్రైన్స్

మొదటి అంకె 5, 6, 7 అయితే:

ఒకవేళ మొదటి అంకె 5, 6, 7 అయితే అవి ప్యాసింజర్ ట్రైన్స్ అని. అలానే రెండవ అంకె జోన్‌ను సూచిస్తుంది. మూడవ అంకె డివిజన్‌ను సూచిస్తుంది.

మొదటి అంకె 8 అయితే:

ఒకవేళ కనుక మొదటి అంకె 8 అయితే రెండవ అంకె రెండు ఉంటుంది.

మొదటి అంకె 9 అయితే:

ముంబై సబర్బన్ రైళ్లు డిజిట్స్ ఇలా ఉంటాయి.

90xxx: విరార్ నుండి వచ్చిన WR స్థానిక రైళ్లు.
91xxx: వసాయ్ రోడ్ / భయాందర్ WR స్థానిక రైళ్లు.
92xxx: బోరివాలి WR స్థానికుల రైళ్లు
93xxx: మలాడ్ / గోరెగావ్ WR స్థానికుల రైళ్లు.
94xxx: అంధేరి / బాంద్రా / ముంబై సెంట్రల్ WR స్థానిక రైళ్లు.
95xxx: CR ఫాస్ట్ రైళ్లు.
96xxx: కళ్యాణ్‌కి ఉత్తరాన వెళ్లే CR స్థానిక రైళ్లు.
97xxx: హార్బర్ లైన్‌ లో CR రైళ్లు.
98xxx: ట్రాన్స్-హార్బర్ లైన్‌ లో CR రైళ్లు.
99xxx: కళ్యాణ్‌కి దక్షిణంగా వెళ్తున్న CR స్థానిక రైళ్లు.

మూడవ అంకె:

ఒకవేళ మొదటి అంకె 0, 1, 2 కనుక అయితే మూడవ అంకె రేక్ రైల్వే జోన్‌ను సూచిస్తుంది. కానీ సున్నా కి ఇది వర్తించదు.

నాలుగు, ఐదు అంకెలు:

రైళ్లు వేరేగా ఉండడానికి ఈ అంకెలు ఉంటాయి. 4NXPX ఢిల్లీ సబర్బన్ రైల్వే రైలు నెంబర్ లో p వీటిని సూచిస్తుంది.

0 నుండి 2 – MEMU
3 నుండి 5 – EMU
6 మరియు 7 – కన్వెన్షనల్ ప్యాసింజర్ కోచింగ్ స్టాక్
8 – DEMU
9 – ఇతర రకాల స్టాక్ కోసం.

Previous articleహారర్ సినిమా అంటే ఇలా ఉండాలి..! అంత భయపెట్టేలా ఈ సినిమాలో ఏం ఉంది..?
Next articleఇప్పటివరకు మీరు ఎప్పుడు చూడని కేసీఆర్ గారి అరుదైన ఫోటోలు…పాలిటిక్స్ లోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో చూడండి.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.