30 లేదా 31వ తేదీల్లో… ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా?

Ads

ఈ సంవత్సరం రక్షాబంధన్ ఆగస్టు 30న జరుపుకోవాలా లేక 31వ తేదీ జరుపుకోవాలా అనే విషయం చాలా మందికి గందరగోళంగా ఉంది. అసలు ఇంతకీ ఏ సమయంలో రాఖీ కట్టాలి.. అనే విషయం తెలుసుకుందాం…

హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అధికమాసం రావడంతో రాఖీ పౌర్ణమి తో పాటు అనేక పండగలు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి.

when raksha bandhan celebrated

ఈ పండగ కేవలం అన్నా చెల్లెలు అనుబంధానికి కాదు.. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమానుబంధాలకు, రక్షణకు సూచనగా జరుపుకుంటారు. ఈ పండుగ సౌత్ ఇండియాలో కంటే కూడా నార్త్ ఇండియాలో మరింత ఘనంగా జరుపుతారు. మనకు ఇక్కడ కేవలం అన్నా తమ్ముళ్లకు మాత్రమే రాఖీ కడితే నార్త్ ఇండియాలో అన్నతమ్ములతోపాటు వదిన, మరదలులకు కూడా కడతారు.

when raksha bandhan celebrated

Ads

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి తిథి నాడు రాఖీ జరుపుకుంటాము. ఈ సందర్భంగా అక్కా చెల్లెళ్లు తమ అన్నదమ్ములు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలి అని ఆశిస్తూ రక్షాబంధన్ ను కడతారు. అయితే ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి 30వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉండడంతో రాఖీ ఎప్పుడు జరుపుకోవాలి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది.

when raksha bandhan celebrated

ఈ సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్షంలోని పౌర్ణమి తిధి బుధవారం ఆగస్టు 30వ తారీఖున 10:58 నిమిషాలకు ప్రారంభమవుతుంది. తిరిగి తిరిగి 31వ ఆగస్టు ఉదయం 7:05 నిమిషాల వరకు ఉంటుంది. 30వ తారీఖున పౌర్ణమి గడియాలు ఉన్నప్పటికీ రాత్రి 9.01 నిమషం వరకు భద్ర కాలం ఉంటుంది. భద్రకాలం సమయంలో రాఖీ కట్టకూడదు. కాబట్టి ఆగస్టు 31వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి 7:05 నిమిషాల లోపు రాఖీ కట్టవచ్చు.

ALSO READ : ఒక సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో తిరుమలలో దర్శనం ఎలా చేసుకోవాలో తెలుసా..?

Previous article“ఛీ… ఛీ ఇదేం పని..?” అంటూ… “సీనియర్ డైరెక్టర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
Next article20 ఏళ్ల సినిమా కెరీర్… 41 సినిమాలు..! కానీ ఒక్కటే హిట్..! ఈ హీరోయిన్ ఎవరంటే..?