“ఛీ… ఛీ ఇదేం పని..?” అంటూ… “సీనియర్ డైరెక్టర్” పై కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

Ads

‘సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్’ మీడియా బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు సీనియర్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి నిర్వహిస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ను టాలివుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా లాంచ్ చేశారు. టీజర్ లాంచ్ వేడుక సందర్బంగా చోటు చేసుకున్న ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హడావిడి చేస్తోంది.

comments on director

ఇంతకీ విషయం ఏమిటంటే…ఈవెంట్ అనంతరం హీరోయిన్ మన్నారా చోప్రాకు టాటా.. బై.. బై…చెప్పడానికి వచ్చిన దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి ఆమెను పబ్లిక్ గా ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ మీడియా కెమేరా లకు బాగా చిక్కడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోకి స్పందించిన నెటిజన్లు.. ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి అని ఆ డైరెక్టర్ ని తిట్టిపోస్తున్నారు. దాంతో పాటుగా మన్నారా చోప్రా వస్త్రాలంకరణ పై కూడా సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

Ads

comments on director

ఆ డైరెక్టర్ చేసేదేముంది అని కామెంట్లు పెడుతున్నారు.ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్న మన్నారా చోప్రా.. ప్రియాంక చోప్రా, పరిణితి చోప్రాలకి వరసకు కజిన్ అవుతుంది. ఇంతక ముందు సునీల్ హీరో గా దొరకెక్కిన జక్కన్న చిత్రంలో ..సాయిధరమ్ తేజ నటించిన తిక్క మూవీలో హీరోయిన్గా చేసింది. అయితే ఇది పెద్దగా సక్సెస్ కాలేదనుకోండి.. ఇక ఈ అమ్మడు ఈ చిత్రంతో తన లెక్క ట్రై చేసుకుంటోంది.

ALSO READ : “ఖుషి” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..! సినిమా ఎలా ఉందంటే..?

Previous article“ఖుషి” ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..! సినిమా ఎలా ఉందంటే..?
Next article30 లేదా 31వ తేదీల్లో… ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా?