తేనె ఎక్కువ రోజులు పాటు పాడవకుండా.. ఎందుకు నిల్వ ఉంటుంది..? కారణం ఏమిటి..?

Ads

ఆరోగ్యానికి తేనె ఎంతో మేలు చేస్తుంది. చాలా మందిని రెగ్యులర్ గా తేనె ని తీసుకుంటూ ఉంటారు. తేనెను తీసుకోవడం వలన ఎన్నో రకాల సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. జీర్ణ క్రియ ని మెరుగుపరచడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. చక్కటి నిద్ర కూడా పొందొచ్చు. తేనె తో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు అందం కూడా పెంచుకోవచ్చు.

చాలా మంది ఉదయం లేచిన తర్వాత తేనె ని నిమ్మరసంతో పాటుగా తీసుకుంటూ ఉంటారు. తేనె ని తీసుకోవడం వలన బరువు తగ్గచ్చు. అలానే గ్యాస్ట్రో ఇంటస్టినల్ సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. గుండె ఆరోగ్యాన్ని కూడా తేనె ఇంప్రూవ్ చేస్తుంది. తేనె లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు యాంటీ మైక్రోబియల్ గుణాలు అందుతాయి. ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా జాగ్రత్త పడొచ్చు.

Ads

అందుకే పూర్వకాలం నుండి కూడా పంచదారకి బదులుగా తేనె ని ఉపయోగిస్తున్నారు. అయితే ఎప్పుడైనా మీకు సందేహం కలిగిందా..? తేనె ఎందుకు పాడవ్వదు…? ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందని.. దాని వెనక కారణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిజానికి స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ కూడా పాడవ్వదు. దాని వెనక కారణం ఏంటంటే తేనెలో ఎక్కువ శాతం చక్కెర ఉంటుంది.

తేనె లో నీటి శాతం చాలా తక్కువగా ఉంటుంది. బ్యాక్టీరియా లేదంటే ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ బతకాలంటే నీళ్లు కావాలి. తేనె లో చాలా తక్కువ నీళ్లు ఉంటాయి కాబట్టి అవి బతకడం కుదరదు. షుగర్ ఎక్కువ ఉండడం వలన హై ఆస్మాటిక్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల బ్యాక్టీరియాలో ఉండే నీళ్లు బయటికి లాగేయబడుతుంది. దీంతో బ్యాక్టీరియా డిహైడ్రేషన్ కి గురై చనిపోతుంది.

తేనె పీహెచ్ వాల్యూ వచ్చేసి 3.9 ఇలాంటి చోట బ్యాక్టీరియా ఉండలేదు. ఎసిటిక్ కండిషన్లో బ్యాక్టీరియా అసలు ఉండదు. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఉంటుంది అది కూడా బ్యాక్టీరియాని బతకనివ్వకుండా చేస్తుంది ఇలా ఈ కారణాల వలన తేనె ఎక్కువ రోజులు పాటు నిల్వ ఉంటుంది.

Previous articleమందు తాగిన వాళ్ళ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటాయి.. కారణం ఏమిటి..?
Next articleX, Y, Z, Z+ కేటగిరీ భద్రత అంటే ఏమిటి..? ఎవరికి ఏ భద్రతాధికారులు వస్తారు..?