మందు తాగిన వాళ్ళ కళ్ళు ఎందుకు ఎర్రగా ఉంటాయి.. కారణం ఏమిటి..?

Ads

చాలా మంది ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆల్కహాల్ ని తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినప్పటికీ చాలా మంది ఆల్కహాల్ కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆల్కహాల్ ని తీసుకుంటే ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోక తప్పదు. ఆల్కహాల్ వలన లివర్ సమస్యలు మొదలు ఎన్నో రకాల సమస్యలు తప్పవు. అయితే ఆల్కహాల్ గురించి ఈరోజు మనం ఒక ఆస్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం..

ఆల్కహాల్ ని తాగిన వాళ్ళని గమనిస్తే కళ్ళు ఎర్రగా ఉంటాయి. అయితే ఆల్కహాల్ ని తీసుకునే వాళ్ళ కళ్ళు ఎందుకు ఎర్రగా మారుతాయి..? దాని వెనుక రీసన్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది కి డౌట్ ఉండే ఉంటుంది. మరి మీకు కూడా ఈ సందేహం ఉంటే ఇప్పుడే క్లియర్ చేసుకోండి.

ఆల్కహాల్ ని తీసుకున్న తర్వాత చాలా మంది వ్యక్తుల కళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆల్కహాల్ వలన రక్తనాళాలు వ్యాకోచిస్తాయి దాంతో బ్లడ్ సప్లై పూర్తిగా పెరుగుతుంది. కంటి ఉపరితలం పైన ఉన్న చిన్న చిన్న రక్తనాళాలు వ్యాకోచించడం వలన ఎర్రగా బ్లడ్ కలర్ లో కనబడుతూ ఉంటాయి. ఆల్కహాల్ సెన్సిటివిటీ ఉన్న వాళ్లలో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతుంది. అలానే ఎక్కువ మద్యం తీసుకునే వాళ్ళకి కూడా ఇది ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది.

Ads

ఈ కారణంగానే ఆల్కహాల్ ని తీసుకున్న వాళ్ళ కళ్ళు ఎర్రగా కనబడుతూ ఉంటాయి. మందుకి ఎడక్ట్ అవడం మంచిదే కాదు. హై బీపీ, హార్ట్ స్ట్రోక్. లివర్ సమస్యలు, జీర్ణ సమస్యలు వంటివి కలుగుతాయి. అలానే నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ వంటివి కూడా మందు తాగే వాళ్లలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఇలా ఏదో ఒక సమస్య ఆల్కహాల్ ని తీసుకునే వాళ్ళల్లో వస్తాయి.

జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వేసవికాలంలో ఆల్కహాల్ కి బాగా దూరంగా ఉండాలి. డిహైడ్రేషన్, వికారం, వాంతులు మొదలైన సమస్యలు కూడా కలుగుతాయి కనుక ఆల్కహాల్ ని తీసుకోకుండా ఉండడమే మంచిది. లేకపోతే లేనిపోని సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Previous articleఐపీఎల్ చరిత్ర లో టాప్ 10 హీటెడ్ మూమెంట్స్..!
Next articleతేనె ఎక్కువ రోజులు పాటు పాడవకుండా.. ఎందుకు నిల్వ ఉంటుంది..? కారణం ఏమిటి..?