X, Y, Z, Z+ కేటగిరీ భద్రత అంటే ఏమిటి..? ఎవరికి ఏ భద్రతాధికారులు వస్తారు..?

Ads

ప్రముఖులకి సెలబ్రిటీలకు భద్రత కల్పించడం మనం చూస్తూ ఉంటాము. రాజకీయ నాయకులకి, విఐపిలకి, వీవీఐపీలకి ఇలా చాలా మందికి కేంద్ర ప్రభుత్వం భద్రతను కల్పిస్తూ ఉంటుంది. నటీనటులకు, క్రీడాకారులకు కూడా అప్పుడప్పుడు భద్రతను కేంద్రం కల్పిస్తూ ఉంటుంది. కాశ్మీర్ ఫ్లైస్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి.. బాలీవుడ్ నటి కంగానా కి కూడా సెక్యూరిటీని కేంద్రం కల్పించింది.

అయితే అసలు ఎలా క్యాటగిరీలుగా విభజిస్తారు..? ఏ క్యాటగిరీల వాళ్ళకి ఎలా భద్రతను ఇస్తారు అనే ముఖ్య విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.. అయితే గ్రేడులు వారీగా క్యాటగిరీలు ఉంటాయి. వారికి ఉండే ప్రమాదాన్ని బట్టి భద్రతని కల్పించడం జరుగుతుంది.

ఎక్స్, వై, వై ప్లస్, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీల కింద విభజిస్తూ ఉంటారు. కేటాయించిన అన్ని కేటగిరీలకి కూడా భద్రతాధికారులు ఉంటారు. ఈ భద్రతాధికారులు ఎన్ఎస్జీ, ఎస్పీజీ, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ కేడర్ కి చెందిన వాళ్లు. ఇప్పుడు వీటి వివరాలని క్లుప్తంగా చూద్దాం.

ఎస్పీజీ కేటగిరీ…

ఈ భద్రత కేవలం ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. ప్రధానమంత్రి ఏ దేశానికి వెళ్లినా ఎక్కడకి వెళ్లినా కూడా ఈ సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్యాటగిరినే దేశంలోనే అన్నిటికంటే ఎక్కువ భద్రతతో కూడి ఉంటుంది. చాలా రహస్యంగా వివరాలు ఉంటాయి. మూడు వేల మంది కంటే ఎక్కువ మంది యాక్టివ్ గా ఈ క్యాటగిరీలో వుంటారు. ప్రధాన మంత్రి భద్రత కోసం వీళ్లంతా వుంటారు. ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని సొంత బాడీ గార్డులు కాల్చి చంపడం వలన 1985 మార్చి 30న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వచ్చింది.

Ads

జడ్ ప్లస్ కేటగిరీ..

55 మంది వుంటారు. 10 మంది ఎన్ఎస్జీ కమాండోలు, 45 మంది పోలీసులు ఉంటారు. మార్షల్ ఆర్ట్స్ లో ఆయుధాలు లేని పోరాటాలు లో వీళ్లంతా శిక్షణ కలిగినవాళ్ళే. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, అధినేత ముకేశ్ అంబానీ వంటి వాళ్లకి ఈ కేటగిరీ భద్రత ఉంది.

జడ్ కేటగిరీ..

22 మంది ఉంటారు. వీళ్లల్లో నాలుగు లేదా ఐదు మంది ఎన్ఎస్జీ కమాండోస్. సెలబ్రిటీలకు, వీఐపీలకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. బాబా రామ్ దేవ్, ఆమిర్ ఖాన్ వంటి వాళ్లకి ఈ సెక్యూరిటీ ఇచ్చారు. ఎస్కార్ట్ కారు కూడా ఉంటుంది.

వై ప్లస్ కేటగిరీ..

దీనిలో మొత్తం 11 మంది వుంటారు. వీళ్లల్లో ఇద్దరు లేదా నలుగురు వరకు ఎన్ఎస్జీ కమాండోలు, పోలీసులు.

వై కేటగిరీ..

దీనిలో అయితే 8 మంది భద్రతాధికారులు ఉంటారు. వీళ్లల్లో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఎన్ఎస్జీ కమాండోలు ఉంటారు. తక్కిన వాళ్లంతా కూడా పోలీసులే.

ఎక్స్ కేటగిరీ..

చివరి కేటగిరీ ఇది. ఇద్దరు భద్రతాధికారులు మాత్రమే వుంటారు. ఎన్ఎస్జీ కమాండోలు దీనిలో వుండరు. ఆర్మ్డ్ పోలీసులు మాత్రమే భద్రతాధికారులు వుంటారు. గౌరవప్రదమైన వ్యక్తులకు, సెలబ్రిటీలకు ఈ సెక్యూరిటీ ఇస్తారు.

Previous articleతేనె ఎక్కువ రోజులు పాటు పాడవకుండా.. ఎందుకు నిల్వ ఉంటుంది..? కారణం ఏమిటి..?
Next articleఏంటి సిల్క్ స్మిత మళ్ళీ ఎలా వచ్చారు..?