మార్క్ జూకెర్‌బర్గ్ ఎప్పుడూ ఎందుకు ఒకేలాంటి టీ షర్ట్స్ వేసుకుంటారు..?

Ads

మార్క్ జూకెర్‌బర్గ్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్. అంతర్జాల వ్యవస్థాపకుడు ఆయన గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ సృష్టికర్తగా ఆయన మన అందరికీ తెలుసు. మార్క్ జూకెర్‌బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆయన వ్యక్తిగత సంపద 17.5 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోని బిలినియర్లలో అతి చిన్న వయసువాడిగా అంచనా వేశారు.

అయితే ఇవన్నీ మనకి తెలుసు కానీ మార్క్ ఎందుకు ఎప్పుడు ఒకే చొక్కాని వేసుకుంటాడు దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని చూద్దాం.. సాధారణంగా ఎవరైనా సరే అకేషన్ కి తగ్గట్టుగా తయారవుతూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రకరకాల టీషర్ట్స్ లేదంటే ఇతర దుస్తులని వేసుకుంటూ ఉంటారు.

మనకి రంగురంగుల బట్టలు ఉంటాయి సందర్భాన్ని బట్టి మనం మన బీరువాలో ఉండే వాటిని ఎంచుకుని వేసుకుంటూ ఉంటాము. ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఎప్పుడు కూడా మనకి ఒకే టీ షర్ట్ లో కనపడుతూ ఉంటారు ఒకే రకమైన టీ షర్ట్ జీన్స్ ని ధరిస్తారు. మార్క్ జుకర్ బర్గ్ ఎందుకు ధనవంతుడైన కూడా ఒకే టీ షర్ట్ ని వేసుకుంటాడు దాని వెనక కారణం ఏమిటి అనేది చూస్తే…

Ads

అతను వేసుకునే అన్ని దుస్తులు కూడా ఒకే రంగులో ఉంటాయి నవంబర్ 2014 న ఈ ప్రశ్న మార్క్ కి ఎదురయింది. అప్పుడు సమాధానం చెప్పారు. ఎప్పుడూ ఒకే చొక్కాని వేసుకోను కానీ అటువంటివే చాలా ఉంటాయని ఇంచుమించుగా బ్రౌన్ కలర్ టీషర్ట్స్ ని వేసుకుంటానని ఏ బట్టలు వేసుకోవాలి ఏ రంగు వేసుకోవాలి అని వాటిని చూసుకుంటూ పోతే సమయం వృధా అవుతుందని..

అందుకని ఒకే లాంటివి వేసుకుంటానని చెప్పారు మార్క్. ఒకసారి తన బట్టల ఫోటోని షేర్ చేస్తూ పెటర్నటీ లీవ్ తర్వాత మొదటి రోజు పనికి వెళుతున్నప్పుడు ఏం వేసుకోవాలో తెలియలేదని చెప్పారు అయితే అందులో రెండు గ్రే టీ షర్ట్లు ఉన్నాయి అయితే ఒకేలాంటి బట్టలు వేసుకోవడం వలన పనిమీద ఫోకస్ పెట్టచ్చని త్వరగా నిర్ణయాలు తీసుకోవచ్చని మార్క్ అభిప్రాయం.

Previous articleఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి..?
Next articleనీ కంటే ముందు నేనే చనిపోతానంది.. చెప్పినట్టే అలా.. ఆఖరికి..!