నీ కంటే ముందు నేనే చనిపోతానంది.. చెప్పినట్టే అలా.. ఆఖరికి..!

Ads

వైవాహిక జీవితం ఎంతో మధురంగా ఉండాలి. చాలా మంది వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. భార్యా భర్తల మధ్య ఏవేవో సమస్యలు వస్తూ ఉంటాయి అయితే ఈ భార్యాభర్తల మధ్య జరిగిన ఈ సంఘటనను మీరు కచ్చితంగా చూడాలి. గుజరాత్ లోని జునాగఢ్ కు చెందిన 30 ఏళ్ల శ్రీనాథ్ సోలంకి ఫోటోగ్రాఫర్. ఆయన భార్య పేరు మౌనిక. మౌనిక గర్భిణీ. అయితే పురిట్లోనే బిడ్డ చనిపోయింది. అలానే మౌనిక కూడా చనిపోయింది.

చనిపోయిన తర్వాత ఆమె కళ్ళని దానం చేశారు. చనిపోయిన వాళ్ళ ఇద్దరినీ కూడా బాజా భజంత్రీలతో సంగీతంతో వీడ్కోలు పలికారు. చనిపోకముందు ఒకసారి ఈ భార్యాభర్తలు సరదాగా ఇలా మాట్లాడుకున్నారు.. నేను ఈ లోకాన్ని వదిలి వెళ్లాక నువ్వు ఏడుస్తావని తన భర్త ఆమెతో చెప్పగా.. ఆమె నీ కంటే ముందు నేనే చనిపోతానని చెప్పారు.

అయితే మౌనిక అప్పుడు పెళ్లికి బ్యాండ్ మేళం తో వచ్చినట్లే నన్ను సాగనింపు అని అతనితో చెప్పింది. మౌనిక మరణం తర్వాత ఆ మాటలే తన భర్తకి గుర్తొచ్చాయి. బ్యాండ్ మేళంతో ఆమె అంతిమయాత్రని పూర్తి చేసామని ఆమెతో పాటు చనిపోయిన పసికందును కూడా తీసుకు వెళ్ళాము అని అతను చెప్పారు. వేల మంది ఆమె అంతిమయాత్రలో పాల్గొన్నారు. శ్రీనాథ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తూ ఉంటాడు.

Ads

మౌనిక కి తెలిసిన వాళ్ళ పెళ్లికి ఫోటోగ్రఫీ అసైన్మెంట్ కి అతను వెళ్ళాడు అప్పుడు వీళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది కొన్ని రోజులు మాట్లాడుకున్న తర్వాత వివాహ ప్రతిపాదన వచ్చింది. 2017లో వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్ళైన ఐదేళ్ల తర్వాత మేము పిల్లల్ని కనాలని అనుకున్నాము. అమ్మాయి పుట్టింది. కానీ ఆ చిన్నారి పుట్టిన కొన్ని క్షణాలకే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయింది అని శ్రీనాథ్ చెప్పారు.

ఆ తరవాత శ్రీనాధ్ మామగారు మోనిక ఆరోగ్యం బాగోలేదు అని ఫోన్ చేసి చెప్పారు. వెరావల్ కి వెంటనే శ్రీనాథ్ వెళ్లాడు. మోనిక చనిపోయింది. మోనికకు రక్త పోటు పెరిగి బ్రెయిన్ స్ట్రోక్‌ రావడంతో.. కడుపులో బిడ్డను కాపాడాలని డాక్టర్ చూసారు. ఆ పసికందు పుట్టిన నాలుగు నిమిషాలకు ఇన్ఫెక్షన్ సోకి చనిపోయింది.

Previous articleమార్క్ జూకెర్‌బర్గ్ ఎప్పుడూ ఎందుకు ఒకేలాంటి టీ షర్ట్స్ వేసుకుంటారు..?
Next articleమీ శరీరం లోని ఈ 7 భాగాలని ప్రెస్ చేసి చూడండి.. అద్భుతం జరుగుతుంది..!