ఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి..?

Ads

మనం ఫోన్ ద్వారా ఎమర్జెన్సీ కాల్స్ ని చేసుకోవచ్చన్న విషయం మనకు తెలిసిందే. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి లైఫ్ లో కూడా ఫోన్ ఒక భాగం అయిపోయింది ప్రతి ఒక్కరూ కూడా ఫోన్ తోనే ఉంటున్నారు. ఎక్కువ సమయంని ఫోన్లో గడుపుతున్నారు అయితే మొబైల్ లేకపోతే అసలు బతుకే లేనట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే ఎమర్జెన్సీ కాల్ గురించి ఈరోజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం..

చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే ఎలా ఎమర్జెన్సీ కాల్స్ పనిచేస్తాయి అని… ఫోన్ లాక్ లో ఉన్నప్పుడు అన్ లాక్ సమయంలో ఎమర్జెన్సీ కాల్ అని ఒక ఆప్షన్ మనకి కనబడుతుంది. దానిమీద క్లిక్ చేస్తే డయల్ ఎస్ఓఎస్ నెంబర్ 112 అని వస్తుంది.

Ads

ఈ నెంబర్ పోలీసులకి, అంబులెన్స్, ఫైర్ సిబ్బందికి ఆపద వేళలో కాల్ చేయడం కోసం ఉపయోగించే నెంబర్. నెట్వర్క్ లేకపోయినా ఫోన్ లాక్ లో వున్నా అత్యవసర కాల్ అనేది కనెక్ట్ అయిపోతుంది. ఇక మరి ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం… ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా సమీపంలో ఉన్న నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్ కు మెసేజ్ వెళ్తుంది.

అలా కాల్ కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకెండ్స్ లోనే ఇది అవుతుంది. ఎమర్జెన్సీ కాల్ విషయంలో కూడా ఇదే జరిగేది. అయితే నెట్వర్క్ లేకపోతే ఎలా కలుస్తుంది..? ఇది వేరే నెట్వర్క్ ద్వారా అవుతుంది. మొబైల్ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ రాకపోతే ఏ మొబైల్ నెట్వర్క్ అయితే అందుబాటులో ఉంటుందో దాని నుండి కాల్ అవుతుంది. కేవలం అత్యవసర కాల్స్ మాత్రమే ఇలా కాల్ వెళ్తుంది. అందరికీ కుదరదు. ఫోన్ లో నెట్వర్క్ లేకపోయినా సమీపంలో వుండే నెట్వర్క్ నుంచి ఫోన్ అవుతుంది.

Previous articleకార్లు మీద lxi,vxi,zxi,vdi అని ఎందుకు ఉంటాయి..? అర్ధం ఏమిటో తెలుసా..?
Next articleమార్క్ జూకెర్‌బర్గ్ ఎప్పుడూ ఎందుకు ఒకేలాంటి టీ షర్ట్స్ వేసుకుంటారు..?