అంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” ఎందుకు విఫలం అయ్యింది..? కారణం ఇదేనా..?

Ads

టాటా గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నో ప్రొడక్ట్స్ టాటా కంపెనీ నుండి వచ్చాయి. టీ, ఉప్పు ఇలా ఎన్నో. కార్లు కూడా వచ్చాయి. టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థ. 150 ఏళ్ల చరిత్ర కలిగి వుంది. రతన్ టాటా ఈ పెద్ద కంపెనీని ఎంతో బాగా తీసుకు వచ్చారు. టాటా నానో కార్ కూడా అందరికీ తెలుసు. ఈ కార్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది కూడా. సక్సెస్ కాలేకపోయింది కానీ.

మరి ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అనేది ఇప్పుడు చూసేద్దాం.. బండి మీద ఫ్యామిలీ తో చాలా మంది ప్రయాణాలు చేసి ఇబ్బంది పడుతూ వుంటారు. అందుకే రతన్ టాటా బాధపడి మధ్యతరగతి ప్రజల కోసం ఈ నానో ని తీసుకు వచ్చారు. ఈ కారు ప్రజల కారుగా పేరు ని పొందింది.

దీని ధర లక్ష రూపాయలు మాత్రమే. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కార్ ను ఈ కంపెనీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ కూడా దీనికి వచ్చింది. కానీ ఇది ఫెయిల్ అయింది. ఈ కార్ సక్సెస్ కోసం రతన్ టాటా చాలా కష్టపడ్డారు. ఏది ఏమైనా లక్ష రూపాయిల కి ఒక కారు ని తయారు చేయడం అనేది ఎంతో కష్టమైనది. ప్రాక్టికల్ గా అసాధ్యం అనే చెప్పాలి.

Ads

అప్పటి సీఈఓ సైరస్ మిస్త్రీ టాటా నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ టాటా కంపెనీలోని యంగ్ ఇంజనీర్స్ తో ఈ కార్ ని తీసుకు వచ్చారు. చాలా ట్రై చేసారు. అయినా కూడా లక్ష తో కారు అవ్వలేదు. సో టాటామోటార్స్ ఏం చేసిందంటే జనాలకి మాట ఇచ్చాము అని నానోలోని బేస్ మోడల్‌ ని మాత్రమే లక్ష రూపాయలకి తెచ్చింది.

మిగతా మోడల్స్ కి 2.5 లక్షల వరకు ధర ని ఫిక్స్ చేసారు. ఈ బేస్ మోడల్‌ కార్ గురించి చూస్తే.. దీనికి ఎయిర్ బ్యాగ్స్ వుండవు. అలానే ఏసీ కానీ సేఫ్టీ రేటింగ్ కానీ ఉండవు. సో నానో కార్ ఆక్సిడెంట్స్ నుండి కాపాడలేదు. చెప్పారని దీన్ని లక్ష కి తీసుకు వచ్చారు. అందుకే నానో ఫెయిల్ అయింది. ద్విచక్రవాహనం మీద వెళ్లాలంటే ఎండా, వానా ఉంటుంది.

అలా కాకుండా ఎండా వానా లేకుండా వెళ్లేందుకు అవుతుంది. కానీ ఈ కారు ఉద్దేశాన్ని మార్కెటింగ్ టీమ్ ప్రజలలోకి సరైన విధంగా తీసుకెళ్ళలేదు. చీపెస్ట్ కారుగా మార్కెట్‌ లోకి తెచ్చారు. ఈ వ్యూహం కారణంగా దీర్ఘకాలంలో ఈ కారు ఫెయిల్ అయ్యిపోయింది. పేదరికానికి చిహ్నంగా తెచ్చారు. ఈ ట్యాగ్ ఎవరికీ కూడా నచ్చలేదు. ఇలా ఈ కారు ఫెయిల్ అయింది.

ఏడాదికి 2,50,000 నానో కార్లను ఉత్పత్తి చేయాలని అనుకున్నారు. ప్రారంభ అమ్మకాలు 30,000 గా ఉంటే 2011-12లో అత్యధికంగా 74,527 అమ్మకాలు జరిగాయి. 2016-17లో 7,591కి పడింది. జూన్ 2018లో ప్లాంట్ 1 నానోనే కొన్నారు. ఇలా ఈ ప్రోడక్ట్ ఆపేసారు.

 

Previous articleఫోన్ ఛార్జర్ మీద వుండే ఈ సింబల్స్ కి అర్ధం ఏమిటో తెలుసా..?
Next articleరోజూ తొంబై నిమిషాలు వాకింగ్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?