రోజూ తొంబై నిమిషాలు వాకింగ్ చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Ads

ఆరోగ్యం బాగుండాలంటే మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో మన జీవన విధానం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తీసుకున్నంత మాత్రాన సరిపోదు. సరైన వ్యాయామం, నిద్ర, నీళ్లు ఇవన్నీ కూడా ఎంతో ముఖ్యం.అయితే చాలామంది ప్రతిరోజూ వాకింగ్ కి వెళ్తూ ఉంటారు. మీరు కూడా వాకింగ్ చేయాలని అనుకుని మానేస్తున్నారా అయితే కచ్చితంగా ఈ విషయాన్ని చూడండి. రోజూ 90 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే ఎంతో ఉపయోగం.

చాలా రకాల ప్రయోజనాలని వాకింగ్ ద్వారా పొందొచ్చు. చాలా మంది అనుకుంటూ ఉంటారు నేను రోజూ చాలాసేపు ఏదో పని వల్ల అటు ఇటు నడుస్తున్నాను కదా వాకింగ్ అయిపోతుంది. ఇంక వాకింగ్ చేయక్కర్లేదు అని భావిస్తారు. కానీ నిజానికి అది వాకింగ్ కాదు.

Ads

ధ్యాస పెట్టి కేవలం వాకింగ్ మాత్రమే చేస్తే దాని ఫలితంగా ఎన్నో బెనిఫిట్స్ పొందడానికి అవుతుంది. మానవ శరీరానికి వాకింగ్ చాలా మేలు కలిగిస్తుంది. మానవ శరీరంలో ఇంచుమించుగా ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. ఒక లీటర్ రక్తంలో ఉండే గ్లూకోస్ ని ఖర్చు చేయాలంటే 15 నిమిషాలు పాటు నడవాలి. ఐదు లీటర్ల రక్తంలో ఉండే గ్లూకోస్ ని ఖర్చు చేయాలంటే గంటన్నర నుంచి గంట యాభై నిమిషాల వరకు నడిస్తే మంచిది. జిమ్ చేసే వాళ్ళు స్పోర్ట్స్ వంటివి ఆడే వాళ్ళు కూడా గంటన్నర సేపు నడవడం మంచిది.

ఎవరికైనా సరే మొదటి రోజే 90 నిమిషాలు వాకింగ్ చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు కొంచెం సేపు మొదట వాకింగ్ చేయడం మొదలుపెట్టి.. దానిని క్రమంగా పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు అలవాటు అయిపోతుంది. వాకింగ్ చేయడం వలన కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడానికి అవుతుంది. ఎనర్జీ లెవీస్ ని పెంచుకోవడానికి అవుతుంది. ఎముకలని కండరాలని వాకింగ్ చేయడం వలన దృఢంగా మార్చుకోవచ్చు. హృదయ సంబంధిత సమస్యలకు దూరంగా ఉండడానికి అవుతుంది. హైబీపీ సమస్య రాకుండా ఉంటుంది. టైప్ టు డయాబెటిస్, క్యాన్సర్ ప్రమాదం నుండి కూడా బయటపడొచ్చు.

Previous articleఅంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” ఎందుకు విఫలం అయ్యింది..? కారణం ఇదేనా..?
Next articleఒరిజినల్ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చిత్రాలు..