ఫోన్ ఛార్జర్ మీద వుండే ఈ సింబల్స్ కి అర్ధం ఏమిటో తెలుసా..?

Ads

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయిందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ తో ప్రతిదీ ఈజీ అయిపోతోంది. అయితే స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే కచ్చితంగా చార్జింగ్ పెట్టాలి. చార్జింగ్ కనుక అయిపోతే మొబైల్ ఫోన్ పనిచేయదు. కాబట్టి కచ్చితంగా చార్జర్ ఉండితీరాలి. చాలా మంది ఎక్కువగా కంపెనీ చార్జర్లు మాత్రమే వాడుతూ ఉంటారు.

ఇక ఇదిలా ఉంటే మొబైల్ చార్జర్ పై కొన్ని సింబల్స్ ఉంటాయి ఈ సింబల్స్ కి అర్థం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. చాలామందికి మొబైల్ చార్జర్ మీద ఉండే ఈ గుర్తులు కి అర్థం తెలియదు.

డబుల్ స్క్వేర్ సింబల్ చార్జర్ మీద ఉంటుంది. దీని అర్థం ఏంటో చూసేద్దాం… ఈ సింబల్ మొబైల్ చార్జర్ వెనుక భాగంలో ఉంటుంది. డబుల్ ఇన్సులేటెడ్ ని ఇది సూచిస్తుంది దీని అర్థం ఏంటంటే మొబైల్ చార్జర్ లోపల ఉండే వైర్లు బాగా పూత పూయబడి ఉండడం కారణంగా చార్జర్ నుండి విద్యుత్ షాక్ ని నివారించవచ్చు అందుకని ఈ సింబల్ ఉండే ఛార్జర్ ని మాత్రమే కొనుగోలు చేయాలి.

Ads

ఈ సింబల్ లేకపోతే రక్షణ లేదు అని గుర్తు పెట్టుకోవాలి. ”వి” అని కూడా చార్జర్ మీద ఉంటుంది. రోమన్ భాషలో ఉండే గుర్తు ఇది. దీనికి అర్థం ఐదు. చార్జర్ యొక్క శక్తి సామర్ధ్యముని సూచిస్తోంది. కంపెనీ చార్జర్ల మీద మాత్రమే ఈ గుర్తు ఉంటుంది. అలానే కొన్ని చార్జర్ల మీద హౌస్ సింబల్ కూడా ఉంటుంది అంటే ఇంట్లో మాత్రమే ఉపయోగించాలి అని.

కేవలం మన ఇంట్లో మాత్రమే 220 వోల్ట్స్ విద్యుత్ సరఫరా అవుతుంది 220 కంటే తక్కువ లేదా ఎక్కువ ఉన్న చోట ఇది సురక్షితం కాదు. డస్ట్ బిన్ సింబల్ కూడ చార్జర్ మీద ఉంటుంది. డస్ట్ బిన్ సింబల్ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనిని డస్ట్ బిన్ లో వేయకూడదు.

ఎలక్ట్రికల్ వస్తువులని ఇంచుమించుగా డస్ట్ బిన్ లో వేయకూడదు చాలా రకాల ఎలక్ట్రికల్ వస్తువులు మీద ఈ సింబల్ ఉంటుంది. అయితే ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు కనుక పనిచేయకపోతే రీసైక్లింగ్ పాయింట్ కి ఇవ్వాలి అంతే కానీ డస్ట్ బిన్ లో పడేయకూడదు.

 

Previous articleపెళ్లి తరవాత సినిమాలకి దూరం అయిన 14 హీరోయిన్లు వీళ్ళే..!
Next articleఅంత క్రేజ్ సంపాదించుకున్న “నానో కార్” ఎందుకు విఫలం అయ్యింది..? కారణం ఇదేనా..?