గుప్త నిధులు గుడిలో ధ్వజస్తంభం కింద ఎందుకు ఎక్కువగా దొరుకుతాయి… కారణం ఏమిటంటే..?

Ads

అప్పుడప్పుడు మనకి వార్తల్లో గుప్త నిధులు దొరికాయని చెప్తూ ఉంటారు గుప్త నిధులు అంటే రహస్యంగా దాచి పెట్టినవి. ఎక్కువగా మనకి పురాతన ఆలయాల్లో, ఆలయ గర్భగుడుల్లో, విగ్రహాల కింద లేదంటే పొలాల్లో కానీ కొండ గుహల్లో, ధ్వజస్తంభాల కింద దొరుకుతాయి. ఎక్కువ శాతం మనకి ఆలయాలలో కనపడుతూ ఉంటాయి. గుప్తనిధుల కోసం ఆ ఆలయాలని ధ్వంసం చేస్తారు కూడా. అయితే ఎందుకు గుప్త నిధులు ఆలయాల్లో ధ్వజస్తంభం కిందన దొరుకుతాయి..? దాని వెనక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

గుప్తనిధుల్ని ఎక్కువగా ధ్వజ స్తంభాల కింద విగ్రహాల లోపల పెట్టేవారు. అయితే ఈ గుప్త నిధులు మొత్తం మూడు రకాలు మొదటి రకాన్ని చూస్తే ఇది వరకు ప్రజలు మనం ఇప్పుడు ఎలా అయితే బ్యాంకులో డబ్బులు దాచుకుంటున్నామొ అలా వాళ్ళు తవ్వి దాచేవారు వాళ్ళ ఇళ్లల్లో పొలాల్లో గొయ్యి తవ్వి ఒక కుండలో బంగారాన్ని పెట్టేవారు.

Ads

అదే రెండవ రకం అయితే గజదొంగలు దోచుకున్న సొమ్ము అంతటినీ కూడా తీసుకువచ్చి తవ్వి భూమి లోపల ఉంచేవారు. ఊరు జనం దగ్గర ఉన్న బంగారం అంతటినీ దోచుకుని కొండ గుహల్లో దాచే వారు. ఇక మూడో రకం అయితే రాజనిధులు ఉద్దేశపూర్వకంగా రహస్య ప్రదేశాలలో వీటిని ఉంచేవారు. అప్పట్లో దండయాత్రలు ఎక్కువ జరిగేవి రాజులనాటి కాలంలో బంగారు రాశులు ఎన్నో ఉండేవి ఎక్కడలేని బంగారం మన దేశంలో ఉండేది. దండయాత్రకి ముందు విదేశీయులు జిడిపిలో మన దేశ జిడిపి 25 నుండి 30% ఉండేది రాజుల కాలంలో బోల్డంత బంగారం ఉండేది.

బంగారు ఆభరణాలు నాణాలు ఇలా కుప్పలు కుప్పలుగా ఉండేవి. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు ఆ సంపద కోసం పోరాటాలు జరిగాయి. భావితరాలకు ఈ సంపద అందాలని విదేశీయుల చేతికి వెళ్లిపోకూడదని రహస్య ప్రదేశాలలో వీటిని దాచారు. ఆలయాల కంటే సీక్రెట్ ప్లేస్ ఏం ఉండదని అప్పట్లో భావించి ధ్వజస్తంభాల కింద గర్భగుడుల్లో పూజలు చేసి నిధులని దాచేవారు. చరిత్రలో వరుస దండయాత్రలు జరగడంతో నిధులు ఏవి కూడా బయటికి రాలేదు ఈ కారణంగానే గుప్తనిధులు గుడిలో ధ్వజస్తంభం కిందన విగ్రహాల కిందా కనపడుతుంటాయి.

Previous articleసిమ్రాన్ కొడుకులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..? వైరల్ అవుతున్న ఫొటోస్..!
Next articleVidudhala Part 1 Review – విడుదల మూవీ రివ్యూ… సినిమా ఎలా వుంది అంటే..?