గడప మీద కాలు ఎందుకు పెట్టకూడదు..? కారణం ఏమిటి..?

Ads

మన ఇంట్లో పెద్దలు గడప మీద కాళ్లు పెట్టకూడదని గడపని పూజించాలి అంటూ ఉంటారు ఎవరైనా మరిచిపోయి గడప మీద కాలేస్తే వెంటనే దిగమని దండం పెట్టుకోమని చెప్తారు. అయితే ఎందుకు గడపని కాళ్లతో తొక్కకూడదు, గడప మీద నిలబడకూడదు..? నిజంగా గడపని తొక్కడం అంత ప్రమాదమా..? మరి దాని వెనుక కారణం ని ఇప్పుడు చూద్దాం. మన ఇంటి ప్రధాన గుమ్మం గడపకి పూజ చేస్తూ ఉంటాము. గడపని సింహ ద్వారంగా లక్ష్మీ ద్వారంగా పిలుస్తూ ఉంటాము ఆ గడప కి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి పువ్వులతో పూజిస్తూ ఉంటాము.

ఈ రోజుల్లోనే కాదు ఎప్పటి నుండో కూడా ఈ సాంప్రదాయం మనకి ఉంది. లక్ష్మీ దేవికి ఇష్టమైన పసుపు గడపకి రాసి దానిపై కుంకుమ బొట్టు పెడతాము. గడపని దాటి వెళుతూ ఉంటాము. అస్సలు తొక్కకూడదు. ఇంట్లోనే కాదు మనం ఆలయాల్లో కూడా ఇలానే చేస్తూ ఉంటాము.

Ads

గడపని తొక్కకుండా వెళ్తాము. పర్వదినాల్లో వారానికి ఒకసారి కానీ మనం గడపకి పసుపు రాస్తూ ఉంటాము. ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని దుష్టశక్తులు ఏమీ లేకుండా ఉంటాయని నమ్ముతూ ఉంటాము. ప్రతి శుక్రవారం నాడు గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి నల్లతాడుతో పటిక కడితే నారా దిష్టి ఉండదు. పోతుంది. అయితే ఇదివరకు అయితే మొత్తం అన్ని గదులకి కూడా గడపలు ఉండేవి కానీ ఇప్పుడు కేవలం ముఖద్వారానికి మాత్రమే గడప ఉంటోంది.

అయితే లక్ష్మి గా భావించి గడపని పూజించడం వలనే మనం తొక్కకూడదని పెద్దలు అంటారు. అందుకనే తొక్కకూడదని పిల్లలకు చెప్తూ ఉంటారు. అలానే గడప మీద పేలు వేసి కుక్కడం అలాంటి తప్పులు చేయకూడదు. సింహద్వారానికి ఉండే గడపలే కాకుండా ప్రతి గడపని కూడా దాటుకుని వెళ్ళాలి. ఆ గడపల్ని కూడా తొక్కు కూడదు. అన్ని గడపలని పూజించకపోయినా కనీసం సింహద్వారం దగ్గర ఉండే గడపకి పసుపు రాసి పూజించడం మంచిది.

Previous articleమాల్స్ లో టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది..? కారణం ఏమిటి..?
Next articleవెన్నని ఎందుకు శ్రీకృష్ణడు దొంగలించేవాడు..? దాని వెనుక కారణం ఇదే..!