మాల్స్ లో టాప్ ఫ్లోర్ లోనే ఎందుకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది..? కారణం ఏమిటి..?

Ads

చాలామంది షాపింగ్ కోసమని ఫుడ్ తినడం కోసం అని మాల్స్ కి వెళ్తూ ఉంటారు మన ఇండియాలో చాలా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో మాల్స్ పెద్దగా ఉంటాయి. అయితే ఏ మాల్ కి వెళ్ళినా ఫుడ్ కోర్ట్ ఎప్పుడు కూడా టాప్ ఫ్లోర్ లో ఉంటుంది. ఎందుకు టాప్ ఫ్లోర్ లోనే ఫుడ్ కోర్ట్ ని పెడతారు..? కింద పెట్టొచ్చు కదా లేదా మధ్యలో పెట్టొచ్చు కదా కానీ ఎందుకు టాప్ ఫ్లోర్ లోనే పెడతారు..? దాని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ మాల్ కి వెళ్లినా కూడా ఫుడ్ కోర్ట్ టాప్ లో ఉంటుంది సైన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ప్రకారం చూసినట్లయితే మనిషి యొక్క మెదడుని ఆహారం బాగా డిస్టర్బ్ చేస్తుంది. ఒకవేళ కనుక ఈ కాన్సెప్ట్ ప్రకారం కింద పెడితే మాల్ కి వచ్చే జనం అంతా కూడా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారు.

Ads

ఏం కొనుగోలు చెయ్యాలి అనే దాని మీద ఏకాగ్రతని పెట్టలేరు. హ్యాపీగా షాపింగ్ చేసుకోలేరు. మరో కారణం ఏమిటంటే ఫుడ్ కోర్ట్ కి స్పేస్ ఎక్కువ పడుతుంది. కిచెన్ ఉండాలి అలానే సెపరేట్ గా డిస్ప్లే ఉండాలి. ఫుడ్ ని ఇచ్చేనందుకు కొంచెం స్పేస్, వెంటిలేషన్ ఇవన్నీ కూడా అవసరమవుతాయి. ఒక ఫ్లోర్ మొత్తం దానికి తీసుకోవాలి. అలాంటప్పుడు టాప్ ఫ్లోర్ సౌకర్యంగా ఉంటుంది. అలానే పెర్ఫ్యూమ్ షాప్స్ వంటివి రెండో ఫ్లోర్లో కానీ మూడో ఫ్లోర్లో కానీ మనకి కనపడవు.

రెండు ఫ్లోర్ కి మూడో ఫ్లోర్ కి వచ్చేసరికి ఆసక్తి తగ్గిపోతుంది పర్ఫ్యూమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. పైగా కింద తినేసాక పైకి వెళ్లి షాపింగ్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది తిన్నాక నిద్ర పోవాలని ఉంటుంది కానీ నడిచి షాపింగ్ చెయ్యడం కాదు. ఇలా ఇబ్బందులు ఉంటాయి. ఈ కారణాల వలన ఫుడ్ కోర్ట్ ని టాప్ ఫ్లోర్ లో పెడతారు. కింద ఫ్లోర్ లో కానీ మధ్య ఫ్లోర్ లో కానీ పెట్టరు.

Previous articleబరువు తగ్గి రూపునే మార్చేసుకున్న 9 మంది సెలెబ్రెటీలు వీళ్ళే…!
Next articleగడప మీద కాలు ఎందుకు పెట్టకూడదు..? కారణం ఏమిటి..?