Ads
ఈ మధ్య పెళ్లి కుదరడమే గగనం అవుతుంటే.. ఆ పెళ్లి కుదిరాక ఏ కారణాలతో రిజెక్ట్ చేస్తారో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఓ అబ్బాయి దాదాపు ఆరేళ్ళ క్రితం తన జీవితంలో జరిగిన విచిత్ర సంఘటనను మాకు మెసేజ్ చేసారు. హైదరాబాద్ లో నివసిస్తున్న రవి అనే అబ్బాయి అబ్బాయి అరేంజ్డ్ మ్యారేజ్ మాట్రిమోనీ సైట్ ద్వారా ఓ అమ్మాయిని కలిసాడు. ఆ అమ్మాయి కూడా హైదరాబాద్ లోనే నివసిస్తోంది.ఆ అమ్మాయిని కలవడానికి రవి బైక్ పై వెళ్ళాడు.
అతను ఇలా చెప్పాడు..”సిటీ ట్రాఫిక్ లో రెండు గంటల పాటు డ్రైవింగ్ చేసి సాయంత్రం ఆరుగంటల సమయంలో ఆ రెస్టారెంట్ కి చేరుకున్నాను. కానీ డ్రైవింగ్ చేయడం వలన బాగా ఆకలిగా అనిపించడంతో.. ఏమైనా తినాలని అన్పించింది.. అదే మాట ఆ అమ్మాయిని కూడా అడగగా… తనకి తినడానికి ఏమి వద్దు అని, పైన్ ఆపిల్ జ్యూస్ మాత్రం తీసుకుంటానని చెప్పింది.”
Ads
నాకు మాత్రం మసాలా దోస ఆర్డర్ చేశాను. అప్పుడు మేము హాబీలు, ఇష్టాలు మరియు అయిష్టాలు, కెరీర్, భవిష్యత్తు ప్రణాళికలు మొదలైన వాటి గురించి చర్చించుకోవడం ప్రారంభించాము. కాసేపటి తర్వాత వెయిటర్ జ్యూస్ మరియు దోసెతో వచ్చాడు.
దోస తింటారా అని ఆ అమ్మాయిని అడిగినా ఆ అమ్మాయి వద్దు అని చెప్పింది. దానితో నేను తినటం స్టార్ట్ చేశాను.అప్పటి నుంచి ఆ అమ్మాయి నన్ను అసహ్యంగా చూడడం స్టార్ట్ చేసింది. మొదట ఇదేమీ అర్ధం కాలేదు. సైలెంట్ గానే తినడం పూర్తి చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని ఆ అమ్మాయి అనడంతో చేసేదేమీ లేక వచ్చేసాను.”
ఒక ఇండియన్ గా దోసె, అన్నం, రోటీ వంటి ఆహార పదార్థాలను వేళ్లతో తినడం నాకు చిన్నప్పటి నుంచి నేర్పించారని, ఇందులో అవమానకరమైన విషయం ఏమిటో నాకు అర్ధం కాలేదని సదరు అబ్బాయి సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది బ్రదర్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.