అత్యధిక కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడిన టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Ads

ఒకప్పుడు ఒక మూవీని హిట్ లేదా ప్లాప్ అని చెప్పాలంటే ఆ సినిమా ఎన్ని రోజులు ఆడింది అనే దాన్ని బట్టి చెప్పేవారు. ఆ తరువాతి రోజుల్లో ఒక సినీ ఎక్కువ రోజులు, ఎన్ని కేంద్రాల్లో ఆడింది అనే దాన్ని బట్టి సినిమా హిట్ డిసైడ్ చేసేవారు.

Ads

అయితే ఇది టీవీలు, స్మార్ట్ ఫోన్ లు, ఓటీటీలు రాని రోజుల్లో జరిగేది. అప్పట్లో సీడీ లు, విసిడి లు ఉన్నాకూడ ఆ ప్రభావం ధియేటర్లో నడిచే సినిమా పై ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ఆలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు రోజుల లెక్క కాకుండా ఒక సినిమా ఎంత వసూల్ చేసింది అనేదాన్ని బట్టే సినిమా హిట్టా? ఫట్టా ? అని ఆధారపడి ఉంది. ఇక 15 ఏళ్ళుగా ఇదే పద్దతి. ప్రస్తుతం యాబై రోజులు ఆడే చిత్రాలే కనిపించట్లేదు. అయితే అప్పట్లో 175 రోజులు ఎక్కువ సెంటర్స్ లో ఆడిన చిత్రాలు కూడా ఉన్నాయి. వాటిలో టాప్ 10 సినిమాలు ఏంటో చూద్దాం రండి..
#1.పోకిరి :
పూరి జగన్నాథ్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా 63 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
#2 .సింహాద్రి :
రాజమౌళి,ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
#3.ఇంద్ర :
బి.గోపాల్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా 35 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#4.సమరసింహారెడ్డి :
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా 29 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#5.పెళ్ళి సందడి :
కే.రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా 27 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#6.నువ్వే కావాలి:
కే.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తరుణ్ హీరోగా వచ్చిన ఈ సినిమా 25 సెంటర్స్ లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#7.ప్రేమాభిషేకం:
అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దాసరి నారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 19 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.
#8.నరసింహ నాయుడు :
బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా 17 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#9.కలిసుందాం రా :
వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా 14 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీ హిట్.
#10.లవ కుశ :
సీనియర్ ఎన్టీఆర్,అంజాలీదేవి కలిసి నటించిన ఈ సినిమా 13 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

Also Read: మెగాస్టార్ టు వైష్ణవ్ తేజ్.. హిట్ కోసం వెయిట్ చేస్తున్న 10 టాలీవుడ్ హీరోలు..

Previous articleఇంటర్వ్యూ లో సక్సెస్ అవ్వాలంటే.. ఈ 6 విషయాలని మరచిపోవద్దు..!
Next articleప్రాజెక్ట్ కె టైటిల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదన్నమాట..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.