ప్రాజెక్ట్ కె టైటిల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదన్నమాట..!

Ads

బాహుబలి తర్వాత మరో భారీ చిత్రాన్ని ప్రభాస్ నుంచి ఆశిస్తున్నా అతని ఫాన్స్ కు రీసెంట్ గా విడుదలైన ఆదిపురుష్ నిరాశ మిగిల్చింది. దీంతో వారి అంచనాలన్నీ తదుపరి మూవీ ప్రాజెక్టు కె పై ఉంచుకున్నారు. ఈ మూవీకి సంబంధించి రీసెంట్గా విడుదల చేసిన ప్రభాస్ ఫస్ట్ పిక్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. మార్వెల్ సిరీస్ కి డూప్లా ఉన్న ప్రభాస్ స్టిల్ చూసి ఫాన్స్ కాస్త నిరాశ చెందారు. కానీ ఆ తర్వాత విడుదలైన ‘ప్రాజెక్ట్ కె’ గ్లింప్స్ వారికి కాస్త ఊరట కలిగించింది.

ఈ మూవీకి ‘కల్కి 2898 -AD ‘అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా మూవీ మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం కల్కి 2898 అంటే ఏమిటి అన్న చర్చ ఆన్లైన్లో తెగ జరుగుతోంది. నిజానికి కల్కి అనేది కలియుగం అంతంలో మహావిష్ణువు ఎత్తే అవతారం అని మన పురాణాలలో చెప్పబడి ఉంది. ప్రపంచంలో అన్యాయం ప్రబలి చీకట్లు అలమకున్న సమయంలో న్యాయాన్ని రక్షించడానికి భగవంతుడు శత్రుసంహారం చేస్తూ కల్కి అవతారంలో ప్రత్యక్షమవుతాడు.

Ads

కల్కి అనే టైటిల్ ఈ మూవీకి పెట్టారు అంటే కచ్చితంగా ఈ స్టోరీ యుగాంతానికి సంబంధించిన నేపథ్యంలో ఉండే అవకాశం ఉంది. 2898 సంఖ్య మన భవిష్యత్తులో వచ్చే సంవత్సరం అయి ఉండవచ్చు.గ్లింప్స్ చూస్తే మంచి యాక్షన్ సీక్వెన్స్ అని అర్థమవుతుంది.. పైగా అందులో చూపించిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఎంతో అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. అంటే కచ్చితంగా ఇది మనకంటే తర్వాత ఎప్పుడో రాబోయే పీరియడ్ కి సంబంధించిన స్టోరీ అని అర్థమవుతుంది.

ఇందులో ప్రభాస్ కాస్త ఐరన్ మాన్ టైప్ లో యాక్షన్ సీన్స్ చేస్తాడు అన్న హిట్ డైరెక్టర్ ఇవ్వకుండానే ఇచ్చారు. భవిష్యత్తులో దారుణంగా ప్రబలతున్న చెడును అంతం చేయడానికి ప్రభాస్ ఎత్తే అవతారమే కల్కి అవతారం కాబట్టి ఈ మూవీకి కల్కి అని పేరు పెట్టి ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు. ఒక వీడియో ఇప్పటికే ఎంతో సంచలనాన్ని సృష్టించింది ఇక ఆ చిత్రం విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో..చూడాలి.

Previous articleఅత్యధిక కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడిన టాప్ 10 మూవీస్ లిస్ట్..!
Next articleరోజుకు ఒక ట్విస్ట్.. గంటకు ఒక గాసిప్…విడుదలకు ముందే ఇంట్రెస్టింగా మారుతున్న కల్కీ మూవీ..