ఒక్క పాటతో నెక్స్ట్ అల్లు అర్జున్ అయిపోయాడు..! ఈ నటుడు ఎవరో తెలుసా..?

Ads

తాజాగా మలయాళం లో RDX అనే మూవీ వచ్చింది. RDX అంటే రాబర్ట్, డానీ, జేవియర్. ఇది మలయాళంలో మంచి హిట్ అయింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అతని పేరు “షేన్ నిగమ్”. ప్రముఖం మలయాళీ సినిమాలో నటించిన నటుడు. మలయాళం లో ఇతనికి మంచి క్రేజే ఉంది. కాకపోతే మొన్నటి వరకు మలయాళం లోనే ఫేమస్ అయిన ఇతను ఇప్పుడు ఒకే ఒక్క సాంగ్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయాడు.

ఇతను నటించిన RDX మూవీలోని నీల నీలవే సాంగ్ అయితే యూట్యూబ్ లో మిలియన్ వ్యుస్ తో దూసుకుపోతుంది. ఒక్క సాంగ్ సరిపోతుంది మనల్ని సెన్సేషన్ చేయడానికి అనడానికి ఈ సాంగ్ ఏ ఒక ఎగ్జాంపుల్.

actor who is next allu arjun

ఈ నటుడు షేన్ నిగమ్  2013 లో నీలాకాశం పచ్చకాదల్ చువన్న భూమి సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత 2016 లో కిస్మత్, 2017 లో పరవ, 2019 లో కుంభలంగి నైట్స్, ఇష్క్, 2022లో భూతకాలం వంటి సినిమాలో నటించి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా 2023 లో RDX మూవీ తో ఒక సెన్సేషన్ అయిపోయాడు. ఇప్పుడు తెలుగులో కూడా ఈ హీరోకి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. కంటెంట్ నచ్చితే చాలు తెలుగు వారు నెత్తిన పెట్టుకుంటారు అనడానికి ఇదొక ఉదాహరణ.

Ads

actor who is next allu arjun

ఇదే సాంగ్ కి తెలుగు లో  ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ రీల్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు కూడా. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 5 కోట్ల 30 లక్షల వ్యూస్ కూడా వచ్చాయి. ఇతన్ని చూసిన వారందరు కూడా షేన్ నిగమ్ డ్యాన్స్ చూస్తే అల్లు అర్జున్ గుర్తొస్తున్నారు. ఒక వేళ యాక్టింగ్ కూడా అలాగే చేస్తే నెక్స్ట్ అల్లు అర్జున్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సి ఎస్ ఈ RDX సినిమాకి సంగీతం అందించాడు. ఎటువంటి అంచనాల లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి రిజల్ట్ సాధించింది. ఇక మీదట ఈ హీరో నటించే సినిమాలు వరుస పెట్టి తెలుగు లో విడుదలవుతాయి ఏమో చూడాలి.ఈ సూపర్ హిట్ సాంగ్ ని మీరు కూడా వినండి.

Watch Song:

 

Previous articleఇంత మంచి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా చూశారా..? అసలు ఎందుకు ఫ్లాప్ అయ్యింది..?
Next articleఓటీటీలో దూసుకెళ్తున్న ఈ సినిమా చూసారా.? ఏకంగా 50 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్ అంట.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.