నటి హేమ ప్రేమ కథ ఎలా మొదలయ్యిందో తెలుసా..? వీరి పెళ్లి ఎప్పుడు జరిగిందంటే..?

Ads

దాదాపు 30 సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో రకమైన పాత్రలు చేసి, ఎంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు హేమ. హేమ ఎలాంటి పాత్ర అయినా చేయగలుగుతారు. కామెడీ తో పాటు సీరియస్ పాత్రలు కూడా హేమ చాలా బాగా చేస్తారు. హేమ అసలు పేరు కృష్ణవేణి. హేమ తూర్పు గోదావరి జిల్లా రాజోలుకి చెందినవారు. ఏడవ తరగతి వరకు చదువుకున్న హేమ తర్వాత చదువులు ఆపేశారు.

చిన్నప్పటి నుండి కూడా హేమాకి నటన అంటే ఆసక్తిగా ఉండేది. 1989 లో వచ్చిన చిన్నారి స్నేహం సినిమాలో హేమ మొదటిసారిగా నటించారు. ఆ తర్వాత కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మావయ్య, బాలగోపాలుడు, పల్నాటి రుద్రయ్య, ఇలా చాలా సినిమాల్లో నటించారు. ఈ సినిమాలన్నిటిలో కూడా హేమ చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చారు.

actress hema love and marriage story

హేమకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా క్షణక్షణం. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హేమ శ్రీదేవికి స్నేహితురాలుగా నటించారు. ఈ సినిమాతో హేమకి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి సినిమాలు చేస్తూనే ఉన్నారు. హేమ సీరియస్ పాత్రలతో పాటు, కామెడీ పాత్రలు కూడా బాగా చేస్తారు. హేమ భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. సయ్యద్ జాన్ అహ్మద్ తండ్రి ఎస్ డి లాల్ గారు అన్నదమ్ముల అనుబంధం, నకిలీ మనిషి వంటి సినిమాలకి దర్శకత్వం వహించారు. సయ్యద్ జాన్ అహ్మద్ కెమెరామెన్ గా చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ గా కూడా గుర్తింపు పొందారు. సయ్యద్ జాన్ అహ్మద్ ఒకసారి హేమతో మాట్లాడుతున్నప్పుడు తనని పెళ్లి చేసుకోమని అడిగారు. ఆ తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

Ads

వీరికి ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు ఈషా. పెళ్లయ్యాక కొన్ని సంవత్సరాలు పాటు హేమ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత మురారి సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా హేమకి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమాలో హేమ ఐదు నెలల గర్భవతిగా ఉన్నారు. అయినా కూడా ఆ సమయంలో నటించారు. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా హేమకి గుర్తింపు తెచ్చాయి. ఎక్కువగా కామెడీ రోల్స్ లో హేమ చేసేవారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో హేమ నటనకి నంది అవార్డు అందుకున్నారు.

ఒక సందర్భంలో హేమ తన కుటుంబం గురించి మాట్లాడుతూ, తన భర్తకి చాలా సిగ్గు ఎక్కువ అని అందుకే ఇంటర్వ్యూలకి రారు అని చెప్పారు. కూతురి గురించి కూడా మాట్లాడుతూ, తన కూతురికి సినిమాలు అంటే ఆసక్తి లేదు అని అన్నారు. అందుకే కెమెరా ముందుకి ఎక్కువగా తీసుకువెళ్లట్లేదు అని అన్నారు. ఒకవేళ, ఆ అమ్మాయి హేమ కూతురు అని తెలిస్తే ఆ తర్వాత తను స్వేచ్ఛగా బయటికి వెళ్లలేదు అని, అందుకే పెద్దయ్యాక హేమ కూతురు ఫోటోలు కూడా ఎక్కడ పోస్ట్ చేయట్లేదు అని చెప్పారు.

Previous articleపెళ్లి తర్వాత ఇలాంటి బట్టలు వేసుకుంటున్నారా.? అయితే ఇది తప్పక చదవండి.!
Next articleనవల ఆధారంగా కథ… నేషనల్ అవార్డు కూడా వచ్చింది..! ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.