గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలకృష్ణ హీరోయిన్..! ఇలా అయిపోయారేంటి..?

Ads

ఆదిత్య 369 సినిమాలో బాలయ్య బాబు తో పాటు నటించిన హీరోయిన్ గుర్తున్నాదా? ఆమె ఎవరో కాదు మోహిని. తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టైం ట్రావెలింగ్ మూవీ ఆఫ్ ఆల్ టైం అని గుర్తుండిపోయే సినిమా ఆదిత్య 369. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మోహిని తెలుగు ప్రేక్షకుల నుంచి ఎంతో గుర్తింపు ఇంకా ఆదరణ పొందింది. ఈమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

aditya 369 heroine mohini present look

కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటిస్తూ అందరి దగ్గర మంచి పేరును సంపాదించింది మోహిని. ఈమె తెలుగులో డిటెక్టివ్ నారద లాంటి మరికొన్ని హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఏ భాషలో సినిమాలు తీసినా సరే అవి హిట్ అవుతూ ఉండేవి. అయితే 2011 లో డిటెక్టివ్ అనే ఒక మలయాళం సినిమా చేసిన తర్వాత ఈమె సినీ పరిశ్రమానికి దూరం అయిపోయింది.

aditya 369 heroine mohini present look

Ads

అప్పటి నుంచి ఏ సినిమా కూడా తీయకుండా పూర్తిగా కనుమరుగైపోయింది. 1999 లో భరత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న మోహిని కి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో తన కుటుంబంతో సహా కనిపించిన మోహిని ని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. ఈమె ఆవిడే కదా ఆదిత్య 369 లో బాలయ్య బాబు తో పాటు నటించింది అని చాలా సేపటి తర్వాత గుర్తు తెచ్చుకొని ఈమె ఫోటోని సోషల్ మీడియాలో పెట్టారు.

aditya 369 heroine mohini present look

తన రూపంలో ఎంతో మార్పు వచ్చిన మోహిని ని గుర్తుపట్టడానికే చాలా సమయం పట్టింది ప్రేక్షకులకు. వందకు పైగా సినిమాలు తీసిన మోహిని సినిమా పరిశ్రమానికి ఎందుకు దూరమైందో ఏమో మరి. ఎన్ని సినిమాలు తీసినా సరే ఆదిత్య 369 లో ఈమె అందాన్ని మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఒకప్పుడు కుర్రకాలను ఊపు ఉపేసిన మోహిని కనుమరుగైపోయి చాలా కాలం తర్వాత లైమ్ లైట్ లోకి రావడం విశేషం.

Previous articleఎమ్మెల్సీ “కల్వకుంట్ల కవిత” భర్త ఏ ఉద్యోగం చేస్తారో తెలుసా..? ఆయన బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?
Next articleమీ అరచేతి మీద M సింబల్ ఉందా..? దాని అర్ధం వింటే షాక్ అవ్వాల్సిందే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.