Love Me If You Dare Review : దిల్ రాజు మేనల్లుడు “ఆశిష్” నటించిన రెండవ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

దిల్ రాజు మేనల్లుడు ఆశిష్, రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇప్పుడు ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : లవ్ మీ ఇఫ్ యు డేర్
  • నటీనటులు : ఆశిష్, వైష్ణవి చైతన్య, రవికృష్ణ, సిమ్రాన్ చౌదరి.
  • నిర్మాత : హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి
  • దర్శకత్వం : అరుణ్ భీమవరపు
  • సంగీతం : ఎం ఎం కీరవాణి
  • విడుదల తేదీ : మే 25, 2024

love me if you dare review

స్టోరీ :

అర్జున్ (ఆశిష్) ఒక మామూలు అబ్బాయి. ఎవరు ఏ పని అయితే చెయ్యొద్దు అని అంటారు అదే పని అర్జున్ చేయాలి అని అనుకుంటాడు. అర్జున్ ని ప్రియ (వైష్ణవి చైతన్య) ప్రేమిస్తుంది. ఒకసారి అర్జున్ రామచంద్రాపురంలో ఉండే ఒక బంగళాలో ఉండే దివ్యవతి అనే ఒక ఆత్మని ఇష్టపడతాడు. ఆ ఆత్మని ప్రేమించే క్రమంలో ఇంకా కొంత మంది ఆత్మలతో అర్జున్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు దివ్యవతి ఎవరు? ఆమె ఆత్మగా ఎలా మారింది? అర్జున్ దివ్యవతిని ఎందుకు ప్రేమించాడు? ప్రియ ఏం చేసింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. దెయ్యాన్ని ప్రేమించడం అనేది కొత్తగా అనిపిస్తుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి అనిపిస్తుంది. పాత్రలు రాసుకునే విధానం ప్రాపర్ గా అనిపించదు. సినిమాకి చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్లు పనిచేశారు. ఫస్ట్ హాఫ్ కొన్ని మంచి విజువల్స్ వల్ల బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో కథ బాగుంటే సినిమా ఇంకొక రకంగా ఉండేది. కానీ ఇక్కడ అలా లేదు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఆశిష్ మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు. తన పాత్రలో తను చాలా బాగా నటించారు. అంతకంటే ఎక్కువ కూడా నటించే అంత స్కోప్ లేదు. పాత్రకి ఎంత కావాలో అంత ఇచ్చారు.

Ads

మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో మాత్రం అన్ని విషయాల్లో చాలా బాగా మెరుగుపడ్డారు అనిపిస్తుంది. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. హీరోయిన్ వైష్ణవి చైతన్య కి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాదు. తన పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాకి మరొక హైలైట్ అయ్యారు సిమ్రాన్ చౌదరి. చాలా బాగా నటించారు. రవి కృష్ణ కూడా తన పాత్రకి తగ్గట్టు నటించారు. ఎం ఎం కీరవాణి అందించిన పాటలు అంత పెద్ద గొప్పగా అనిపించవు. అలా ఫ్లోలో వెళ్లిపోతాయి. సినిమాకి అతి పెద్ద ప్లస్ పాయింట్ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ. ఒకరకంగా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా రావడానికి కారణం సినిమాటోగ్రఫీ. సెకండ్ హాఫ్ లో కూడా సినిమాని సేవ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ కథలో ఇంకా బలంగా ఉంటే విజువల్స్ ఇంకా బాగా కనిపించేవి.  నిర్మాణ విలువలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి.

సినిమాలో కొన్ని సర్ప్రైజ్ చేసే స్పెషల్ అపియరెన్స్ లు కూడా ఉన్నాయి. సినిమా చివరిలో రెండవ భాగానికి దారి ఇస్తూ మరొక హీరోయిన్ కూడా కనిపిస్తారు. ఆమె ఎవరో మీరు తెర మీద చూస్తేనే బాగుంటుంది. డైరెక్టర్ రాసుకున్న స్టోరీ పాయింట్ పేపర్ మీద బాగుంటుంది. కానీ రూపొందించే క్రమంలో మాత్రం పొరపాట్లు జరిగాయి. పాత్రలు రాసుకున్న విధానంలో క్లారిటీ తగ్గినట్టు అనిపిస్తుంది. వైష్ణవి చైతన్య పాత్ర, సిమ్రాన్ చౌదరి పాత్ర ఇంకా బాగా రాసుకునే అవకాశం ఉంది. వాళ్ల పాత్రలు అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాయి అన్నదానికి సరైన కారణం తెలియదు. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

ప్లస్ పాయింట్స్ :

  • సినిమాటోగ్రఫీ
  • నిర్మాణ విలువలు
  • సెట్టింగ్స్
  • ప్రొడక్షన్ డిజైన్

మైనస్ పాయింట్స్:

  • పాత్రల్లో లోపించిన క్లారిటీ
  • సరిగ్గా రాసుకోని సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

స్టోరీ పాయింట్ బాగున్నా కూడా కథనం ఆసక్తికరంగా అనిపించదు. కానీ అసలు సినిమాలో ఇలాంటి ఒక స్టోరీని ఎలా హ్యాండిల్ చేశారు, రెండవ భాగానికి ఎలాంటి లీడ్ ఇచ్చారు అనేది తెలుసుకోవాలి అంటే లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

Previous articleనా భార్య చేస్తున్న ఈ పని నాకు అస్సలు నచ్చట్లేదు..! దీనికి వేరే మార్గం లేదా..?
Next articleకేవలం కళ్ళు మాత్రమే చూసి… ఈ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో చెప్పగలరా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.