బిగ్‌బాస్-7 హౌస్‌లోనే స్పెషల్ అట్రాక్షన్..! ఈ అమ్మాయి ఎవరంటే..?

Ads

ఉల్టా పుల్టా అంటూ ఈసారి వెరైటీగా బిగ్ బాస్ షోని హోస్టింగ్ చేస్తున్న నాగార్జున.. ఆట ఆడకుండా మిగిలిన వాళ్ళ భావాలతో ఆడుకుంటూ.. సేఫ్ గేమ్ ఆడుతూ…గ్రూపులు చేస్తూ ముందుకు పోతున్న కంటెస్టెంట్స్ ను ఉతికి ఆరేస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ షో మొదలైన తర్వాత ప్రస్తుతం హిందీలో తమిళ్ లో కూడా బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యాయి. అయితే అక్టోబర్ 1 న స్టార్ట్ అయినటువంటి తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7 ను కమల్ మరింత భిన్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

bigg boss tamil

ఈసారి తమిళ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ హౌస్ లోకి సీనియర్స్ తో పాటు జూనియర్స్ కూడా అడుగుపెట్టారు. ఈ షోలో ఒక అమ్మాయి స్పెషల్ అట్రాక్షన్ అనడంలో ఎటువంటి డౌటు లేదు. ఆమె మరెవరో కాదు నటి వనితా విజయ్ కుమార్ కూతురు జోవిక విజయ్ కుమార్. ఇప్పటికే జోబిక తన తల్లి నడుపుతున్న వంటల యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేయడంతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీ సంపాదించింది.

Ads

bigg boss tamil

చెన్నైలో తన గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసుకున్న జోవిక తొలిత మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత క్రమంగా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించి ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడం కోసం ఆమె ట్రై చేస్తోంది. తల్లి స్టార్ట్ చేసిన యూట్యూబ్ కుకింగ్ వీడియోల ద్వారా ఎలాగైతే క్రేజ్ తెచ్చుకుందో అదే విధంగా ఇప్పుడు తల్లి బాటలోని బిగ్ బాస్ షోలో అడుగు పెట్టింది. వచ్చి రాగానే ప్రేక్షకుల ఎమోషన్స్ ను బాగా టచ్ చేసే విధంగా తన తల్లి తనకు తోడు ఉన్నారనే ఫీలింగ్ తోనే ఉన్నట్లు చెప్పి ఎమోషనల్ అయింది

Previous articleగుర్తుపట్టలేనట్టు మారిపోయిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
Next articleసైలెంట్ గా OTT లోకి వచ్చేసిన ఈ సినిమా చూశారా..? ఏం ఉంది ఇందులో..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.