మురారి సినిమా డైలాగ్ తో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? సెలబ్రిటీలు కూడా మెచ్చుకున్నారు..!

Ads

సోషల్ మీడియాలో అటు ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇటు మైనస్ పాయింట్స్ కూడా ఉంటాయి. సరిగ్గా వాడితే సోషల్ మీడియా ద్వారా ఎంతో ప్రతిభ బయటకు వస్తుంది. చాలా మంది తమకి సరైన అవగాహన లేని కారణంగా, లేదా మరేదో కారణంగా వారి టాలెంట్ చూపించుకునే అవకాశం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉండి కూడా ప్రపంచానికి చూపించలేకపోయాము అని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి సోషల్ మీడియా అనేది ఒక మాధ్యమం లాగా ఉపయోగపడుతుంది.

celebrity famous with murari movie dialogue

సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయమైన టాలెంటెడ్ ప్రజలు ఎంతో మంది ఉన్నారు. వారిలో కొంత మంది ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఒక యువతి గురించి అలాగే మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు హీరోగా నటించిన మురారి సినిమా మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాలో ప్రస్తావన వస్తే ముందు ఉండే సినిమా. ఇందులో మహేష్ బాబు పాత్రతోపాటు సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర లక్ష్మీ గారి పాత్ర. మహేష్ బాబు పాత్ర అయిన మురారిని తన సొంత కొడుకు లాగా చూసుకుంటారు. లక్ష్మీ గారి భర్త పాత్రలో ప్రసాద్ రావు గారు నటించారు.

 

లక్ష్మీ గారిది ఈ సినిమాలో ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది. తన పెళ్లయి వచ్చినప్పుడు మురారి ఎలా ప్రవర్తించాడు అని చెప్తూ లక్ష్మీ గారు ఎమోషనల్ అవుతారు. ఈ విషయాన్ని చాటుగా వింటున్న మురారి కూడా ఎమోషనల్ అవుతాడు. వాళ్లు మాత్రమే కాదు. సినిమాలో ఈ సీన్ చూస్తున్నప్పుడు కంటతడి పెట్టుకొని ప్రేక్షకులు ఉండరు. మణిశర్మ గారు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కృష్ణవంశీ గారి డైరెక్షన్, నటీనటుల నటన, ఇవన్నీ కలిపి ఒక పర్ఫెక్ట్ సీన్ గా ఇది నిలిచింది. ఇలాంటి సీన్ ని, అందులోనూ లక్ష్మీ గారి పర్ఫార్మెన్స్ ని మళ్లీ ఎవరైనా క్రియేట్ చేయడం అంటే సాహసం.

 

అసలు ఎవరి వల్ల కూడా కాదు. లక్ష్మీ గారు అంత గొప్పగా నటించారు. కానీ ఒక అమ్మాయి లక్ష్మీ గారు చేసినంత బాగా చేసి ఇంస్టాగ్రామ్ లో ఒక రీల్ షేర్ చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలు ఆ అమ్మాయి రీల్ కి కామెంట్స్ పెట్టారు. అమ్మాడి 0786 పేరుతో ఈ అమ్మాయి ఇంస్టాగ్రామ్ ఐడి ఉంది. కొన్నాళ్ల క్రితం ఈ వీడియో షేర్ చేసింది. బాలాదిత్య, హిమజ, సింగర్ రేవంత్, మై విలేజ్ షో అనిల్ తో పాటు ఇంకా ఎంతో మంది కామెంట్స్ పెట్టారు. ఈ అమ్మాయి వీడియో చూస్తే ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. అంత బాగా నటించింది.

watch video :

Previous articleసోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన ఈమె ఎవరో తెలుసా..? ఈమె కూతురు కూడా మనందరికీ తెలిసిన వారే..!
Next articleఈ ఇద్దరు హీరోలు చేసిన సాహసం వేరే హీరోలు చేయగలుగుతారా..? ఆ ధైర్యం ఉందా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.