ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..? ఎందుకు చేయలేదు అంటే..?

Ads

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా పాటలు ఇప్పటికే చాలా పెద్ద హిట్ అయ్యాయి. సినిమా కథపరంగా బాగుంది. ఎంచుకున్న స్టోరీ పాయింట్ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి అనిపిస్తుంది. కొన్ని సీన్స్ అయితే అసలు లాజిక్ కి దూరంగా రాసుకున్నారు. కొన్ని డైలాగ్స్ కూడా అంత బాగా అనిపించలేదు.

అందులోనూ సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అయితే ఇబ్బందికరంగా అనిపించాయి. దాంతో రొటీన్ స్టోరీ అని కొంత మంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. గీతా గోవిందం ఫార్మాట్ లోనే ఈ సినిమా కూడా నడుస్తుంది. అయితే ఆ సినిమా అప్పుడు అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండని ఒక రోల్ లో చూసి, గీతా గోవిందం సినిమాలో మరొక వేరియేషన్ లో చూడడంతో ప్రేక్షకులకు కొత్తగా అనిపించి హిట్ అయ్యింది. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సెలక్షన్ మీద కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. దాంతో ఈ సినిమాకి ప్రస్తుతం మిక్స్డ్ టాక్ వస్తోంది.

Ads

అయితే, ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుకున్నది మృణాల్ ఠాకూర్ ని కాదు. ఈ సినిమాలో మొదట సాయి పల్లవిని హీరోయిన్ పాత్ర కోసం అనుకున్నారు. అయితే, విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో లవ్ సీన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సాయి పల్లవి అవి చేయడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంది అని సాయి పల్లవిని వద్దు అన్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ ఒకవేళ సాయి పల్లవి ఈ పాత్ర చేసి ఉంటే ఎలా ఉండేది అని ఆసక్తి మాత్రం అందరిలో నెలకొంది. కానీ మరొక పక్క మృణాల్ ఠాకూర్ కూడా బాగా నటించారు. నటీనటుల పర్ఫార్మెన్స్ లు అందరివి బాగున్నాయి. కాబట్టి నటీనటుల ఎంపికకు మంచి మార్కులు పడుతున్నాయి.

ALSO READ : FAMILY STAR REVIEW : “విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Previous articleఅరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా! : కొత్తపల్లి గీత
Next articleసూర్యకాంతం గారు చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ చూశారా..? ఇందులో ఏం మాట్లాడారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.