“ఆదిపురుష్” పై వస్తున్న నెగెటివ్ టాక్ వెనుక ఉన్న 5 కారణాలు..

Ads

ప్రభాస్ , కృతి సనన్ సీతారాములుగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని రామాయణం ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. రూ 500 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే మూవీ రిలీజ్ కి ముందు ఎంత హైప్ వచ్చిందో, ఈ మూవీ రిలీజ్ అయ్యాక మొదటి షో నుండి ఈ చిత్రం పై అంతగా విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ షో చూసిన ఆడియెన్స్ ఈ మూవీ పై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ మూవీ పై నెగటివ్ కామెంట్స్ రావడానికి కొన్ని కారణాలు చెప్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
adipurushరాముడిగా ప్రభాస్: 

ప్రభాస్ రాముడిగా  కొన్ని సీన్స్ లో బాగున్నా, సెకండ్ హాఫ్ లో మాత్రం ప్రభాస్ క్యారెక్టర్ ను గ్రాఫిక్స్ కే పరిమితం చేసారు. ప్రభాస్ వేషధారణ కూడా అంత బాలేదని, వనవాసానికి వెళ్ళేప్పుడు రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు నార వస్త్రాలు ధరించి వెళతారు. కానీ ఆదిపురుష్ లో ఆ విధంగా కనిపించలేదు.ఇక మూవీలో సీతారాముల అనుబంధం అంతగా చూపించలేదని, కృతి సనన్ సీతగా ఆకట్టుకోలేదని, రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళేప్పుడు ఏదో వింత పక్షిని చూపించాడని అంటున్నారు. రామాయణంలో ఉన్నట్టు కాకుండా ఏదో వింతలోకం, వింత జీవులను చూపించారని చెప్తున్నారు.

రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్:

ఈ చిత్రంలో ముందుగా అందరూ విమర్శిస్తున్నది రావణడి పాత్రనే. ఈ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించాడు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ సరిపోయినా, డైరెక్టర్ ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం సరిగా లేదని కామెంట్స్ చేస్తున్నారు. గొప్ప శివభక్తుడు అయిన రావణడిని హాలీవుడ్ సినిమా విలన్ గా చూపించాడని అంటున్నారు. ఆ క్యారెక్టర్ ను మలచిన విధానం అసలు నచ్చలేదని, కొండచిలువలతో రావణుడు మర్దనా చేయించుకున్న సీన్ చూసి విమర్శిస్తున్నారు.

Ads

ఆకట్టుకోని విఎఫ్ఎక్స్:

ఈ మూవీని విజువల్ వండర్ లా రూపొందించామని మూవీ రిలీజ్ కి ముందు మేకర్స్ చెప్పారు. కానీ ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ అంతగా ఆకట్టుకోలేదని అంటున్నారు. ఏ గ్రాఫిక్స్ లేని రోజుల్లో తీసిన  పౌరాణిక చిత్రాలు చక్కగా ఉంటాయి. ప్రస్తుతం ఆధునిక సాంకేతికత ఉన్నా, ఈ మూవీలో సరిగ్గా ఉపయోగించుకోలేదని అంటున్నారు.
యుద్ధ సన్నివేశాలు:

‘ఆదిపురుష్’ సెకండ్ హాఫ్ లో యుద్ధం సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అవి బాలేదని అంటున్నారు. ఏదో హడావుడిగా తీసినట్టు ఉందని అంటున్నారు. ఇంద్రజిత్ ని చంపే సన్నివేశం బాలేదని, యుద్ధ సన్నివేశాలు బోర్ గా ఉన్నాయని, హనుమంతుడు లంకలో అశోక వనాన్ని ధ్వంసం చేస్తాడు. అయితే ఈ మూవీలో మాత్రం సీత ముందే హనుమంతుడు యుద్ధం చేశాడని అంటున్నారు.
సాధారణంగా ఇతర భాషా చిత్రాలను తెలుగులోకి డబ్బింగ్ చేస్తుంటారు. వాటిలో కొన్ని చిత్రాలు కనెక్ట్ అవుతాయి. రూ. 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు స్టార్ హీరోతో తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేసినప్పుడు డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ మూవీ విషయంలో అలాంటివి ఏం తీసుకోలేదని అంటున్నారు. ఎవరి క్యారెక్టర్ కూడా తెలుగుకి సింక్ కాలేదు. పాత్రల పేర్లు తెలుగు ఆడియెన్స్ కి అంతగా నచ్చలేదని అంటున్నారు.

Also Read: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరో తెలుసా..?

Previous articleబాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, ప్రభాస్‌ను కలిపింది ఎవరో తెలుసా..?
Next articleతెలంగాణ రాజకీయంలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.