ప్రేమ వివాహం… పెద్దలు కుదిర్చిన వివాహం… ఈ రెండిట్లో ఏది మంచిది..? ఈ విషయం మీద నిపుణులు ఏం అన్నారంటే..?

Ads

పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని చెబుతారు. వివాహం అనేది ఒక వ్య‌క్తిని ఎంచుకుని పెద్ద‌ల స‌మ‌క్షంలో వివాహ  బంధంలోకి అడుగుపెట్టే సంప్ర‌దాయమైన వేడుక. ఈ మధ్యకాలంలో ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ప్రేమించి, వివాహం చేసుకోవాలా?

లేక పెద్ద‌లు కుదిర్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. జీవితాంతం తమతో క‌లిసి న‌డిచే వ్యక్తిని ఎంపిక చేసుకోవడంలో ఇటువంటి  కన్ఫ్యూజన్ ఉండ‌డం స‌హ‌జ‌మే. మరి ప్రేమ పెళ్లి, పెద్దలు చేసిన పెళ్లి, రెండింటిలో ఏది మంచిదో? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..

love or arranged marriage which is better

1. ప్రేమ పెళ్లి:

ప్రేమ పెళ్లి ద్వారా ప్రేమించుకున్న ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఎక్కువగా తెలుసుకుని, అర్ధం చేసుకుని ఇద్దరు కలిసి బ్రతకాలని నిర్ణయించుకుని పెళ్లితో ఒకటి అవుతారు. వీరు పెళ్లి చేసుకోవడం కోసం కులం, మతం, ఆర్ధిక స్థితి వంటి వాటిని చూడకుండా ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈ వివాహంలో తమకు ఏం కావాలో తెలుసుకుని, వివాహ బంధంలోకి వెళతారు. ప్రేమ వివాహంలో చాలా కాలం నుండి ప్రేమించుకుంటున్నారు కాబట్టి ఒకరి అభిరుచుల గురించి మరొకరికీ తెలియడం వల్ల అర్ధం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమస్యలు వచ్చినపుడు కలిసి ప‌రిష్క‌రించుకుంటూ, ముందుకెళ్తారు.
2. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి:

Ads

ఈ పెళ్లి కులం, మతం, ఆర్ధిక స్థితి వంటి అంశాల ఆధారంగా ఇద్దరు వ్యక్తులు వారి పెద్దలు కుదిర్చడం ద్వారా పెళ్లి చేసుకుంటే దానిని అరెంజ్ మ్యారేజ్ అంటారు. ప్రేమ వివాహంలో పెళ్ళికి ముందు ప్రేమించుకుంటే, అరెంజ్ మ్యారేజ్ లో పెళ్లి అయిన తరువాత ప్రేమించుకుంటారు. పెద్దలు కుదిర్చిన పెళ్ళిలో ఒక‌రి గురించి మరొక‌రు తెలుసుకుంటూ, స‌మ‌స్య‌లు ఏవైనా వ‌చ్చిన‌ప్పుడు తమ పెద్ద‌ల సహాయంతో ప‌రిష్క‌రించుకుంటూ, ఒకరి గురించి మరొకరు కొత్త విష‌యాలు తెలుసుకుంటూ మరింత అన్యోన్యంగా ఉంటారు.ప్రేమించి వివాహం చేసుకున్నా లేదా పెద్ద‌లు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా కూడా ఆ బంధం అనేది నిలబడాలంటే  అది ఆ భార్యా భ‌ర్త‌ల‌ మీదనే ఆధార‌ప‌డి ఉంటుంది. ఇద్దరి మ‌ధ్య ఉండే న‌మ్మ‌కం, ప్రేమానురాగాలు పెళ్లి నిలబడడంలో కీల‌క పాత్రను పోషిస్తాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అంటే ఈ క్రింది వీడియో చూడండి..

watch video: 

 

Previous articleతెలుగు ఇండస్ట్రీ లో విడాకులు తీసుకున్న సెలెబ్రెటీలు వీరే..!
Next articleసెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దసరా హీరో కొత్త సినిమా..! అసలు ఏం ఉంది ఇందులో..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.