టిల్లు స్క్వేర్ సినిమాలో ఈ సీన్ గమనించారా..? ఈ మిస్టేక్ ఎలా చేశారు..?

Ads

భారీ అంచనాల మధ్యలో విడుదల అయ్యి, అంతే భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సినిమా టిల్లు స్క్వేర్. సినిమా మీద అంచనాలు ఎక్కువగా ఉండడానికి కారణం, మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడం. డీజే టిల్లు ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి, ఆ సంవత్సరం వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే అందరిలో ఆసక్తి నెలకొంది. సాధారణంగా సీక్వెల్ సినిమాలు ముందు వచ్చిన సినిమా అంత స్థాయిలో ఉండవు.

mistake in tillu square movie

కానీ ఈ సినిమా అలా కాదు. మొదటి భాగం లాగానే ఈ సినిమా కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. స్టోరీ టెంప్లేట్ మొదటి భాగంలో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఎంటర్టైనింగ్ గా రాసుకున్నారు. ఈ సినిమాకి మూడవ భాగం ఉంటుంది అని కూడా ప్రకటించారు. కానీ ఎప్పుడు ఉంటుంది అనేది చెప్పలేదు.

Ads

కానీ మధ్యలో సిద్దు జొన్నలగడ్డ మరికొన్ని సినిమాలు చేస్తారు అని సమాచారం. ఆ సినిమాల గురించి ఇప్పటికే ప్రకటనలు వచ్చాయి. ఆ తర్వాతే టిల్లు క్యూబ్ సినిమా వస్తుంది అని అంటున్నారు. అయితే సినిమా అన్న తర్వాత పొరపాట్లు జరగడం సహజం. ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఏ సినిమాలో అయినా ఏదో ఒకచోట చిన్న పొరపాటు జరుగుతుంది.

mistake in tillu square movie

ఈ సినిమాలో కూడా అలాగే ఒక పొరపాటు జరిగింది. సినిమాలో ఇంటర్వెల్ తర్వాత ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ లో హీరోయిన్ పాట పాడుతూ ఉంటుంది. హీరో అప్పుడే నిద్ర లేచి వస్తూ ఉంటాడు. హీరోయిన్ అలా పద్ధతిగా ఉండటం చూసి హీరో ఆశ్చర్యపోతాడు. హీరో వెనుక ఈ సీన్ లో ఒక అమ్మాయి ఉంటుంది.

అయితే, హీరోయిన్ వైపు చూపించినప్పుడు హీరోయిన్ పాడుతున్నప్పుడు ఆ అమ్మాయి హీరోయిన్ పక్కనే కూర్చుని ఉంటుంది. ఒకే సీన్ లో రెండు చోట్ల ఆ అమ్మాయి ఎలా కనిపించింది అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇది ఎడిటింగ్ లో జరిగిన పొరపాటు అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇలాంటి చిన్న చిన్న వాటిని కూడా కనిపెడుతూ ఉంటారు. దాంతో ఇప్పుడు దీని మీద కామెంట్స్ వస్తున్నాయి.

Previous articleహిట్ కాంబినేషన్ లో వచ్చిన మరొక సినిమా..! ఎలా ఉందంటే..?
Next articleEVV సత్యనారాయణ లాంటి దర్శకులు లేరు… రారు..! అందుకు కారణాలు ఇవే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.