“పుష్ప” నుండి… “దేవర” వరకు… 2 భాగాల్లో రిలీజ్ అవ్వబోతున్న 13 సినిమాలు..!

Ads

టాలీవుడ్ లో బాహుబలి చిత్రం ఒక ప్రభంజనాన్ని సృష్టించింది…. బాహుబలికి ముందు ఒక లెక్క బాహుబలి తర్వాత ఒక లెక్క అన్నట్లుగా ఉంది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలావరకు సినిమాలకి సీక్వెల్ తీయడం ట్రెండ్ గా కొనసాగుతోంది. బాహుబలి తర్వాత కేజిఎఫ్, పొన్నియిన్ సెల్వన్ మూవీస్ సీక్వెల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఆ తరువాత పుష్ప సీక్వెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

movies which are releasing in two parts

ఇవే కాకుండా తెలుగులో మరిన్ని చిత్రాలు సీక్వెల్ గా రావడానికి సిద్ధమవుతున్నాయి. కొన్ని ఆల్రెడీ విడుదలైన సినిమాలకు సీక్వెల్స్ చేయబోతుంటే ఇంకా విడుదల కాకుండా సెట్స్ మీద ఉన్న చిత్రాలకు కూడా సీక్వెల్ చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ సలార్, పవన్ హరిహర వీరమల్లు చిత్రాలు ఇంకా సెట్స్ పైనే ఉన్న వాటికి సీక్వెల్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కొన్ని చిత్రాలకు సీక్వెల్ మూవీ రిలీజ్ అయ్యే స్టేజ్ లో ఉంటే మరికొన్ని ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉన్నాయి. ఈ మూవీస్ ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అవడంతో రాబోయే సెకండ్ పార్ట్ ల పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.మరి టాలీవుడ్ లో ప్రస్తుతం ఏ చిత్రాలకు సీక్వెల్స్ రాబోతున్నాయో ఓ లుక్ వేద్దాం పదండి…

#1 పుష్ప

అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన పుష్ప చిత్రం సీక్వెల్, పుష్ప 2 ద రూల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

#2 కాంతార

చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కన్నడ చిత్రం ఎవరు ఊహించని విధంగా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

#3 అఖండ

బాలకృష్ణకు అఖండమైన సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన అఖండ మూవీ కు సీక్వెల్ గా అఖండ 2 రాబోతోంది.

movies which are releasing in two parts

#4 స్కంద

Ads

ఈ లేటెస్ట్ మూవీకి కూడా త్వరలో సీక్వెల్ రాబోతోంది.

#5 టిల్లు స్క్వేర్

డీజే టిల్లు చిత్రంతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా రాబోయేదే టిల్లు స్క్వేర్.

movies which are releasing in two parts

#6 ఈ నగరానికి ఏమైంది

ప్రస్తుతం ఉన్న సమాజం గురించి ఆలోచింపజేసే చిత్రంగా మన ముందుకు వచ్చిన ఈ నగరానికి ఏమైంది మూవీకి కూడా సీక్వెల్ తీయబోతున్నారు.

movies which are releasing in two parts

#7 దేవర

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవర కూడా రెండు భాగాలలో తీయబోతున్నారు.

#8 బ్రహ్మాస్త్ర

ఈ బాలీవుడ్ మూవీ సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు ఎక్సయిటెడ్ గా ఉన్నారు.

movies which are releasing in two parts

#9 సలార్

డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్న ప్రభాస్ సలార్ చిత్రం కూడా రెండు భాగాలలో చిత్రీకరించడం జరుగుతుంది.

venu swamy about prabhas

#10 విక్రమ్

కమల్ హాసన్ కు ఎక్సలెంట్ సెకండ్ ఇన్నింగ్స్ ఇచ్చిన విక్రమ్ చిత్రానికి కూడా సీక్వెల్ మూవీ ఉంటుంది.

#11 హరిహర వీరమల్లు

పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారిక్ డ్రామా హరిహర వీరమల్లు రెండు భాగాలలో తెరకెక్కించడం జరుగుతుంది.

movies which are releasing in two parts

#12 సర్దార్

కార్తీ నటించిన సర్దార్ మూవీకి కూడా త్వరలో సీక్వెల్ రెడీ అవుతుంది.

movies which are releasing in two parts

#13 విరూపాక్ష

సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్ సంపాదించిన సాయిధరమ్ తేజ విరూపాక్ష చిత్రానికి కూడా సీక్వెల్ ఉంటుంది

Previous articleట్రెండింగ్ లో ఉన్న హైదరాబాద్ “లులు మాల్” వీడియోలో ఏం ఉంది..? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే..?
Next articleఏలినాటి శని అంటే అంటే.? దాని నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.