మనవరాలిగా చేసిన “శ్రీదేవి” మీపక్కన హీరోయిన్ అనేసరికి “ఎన్టీఆర్” ఏమన్నారో తెలుసా.?

Ads

అలనాటి తార…అతిలోక సుందరి శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల అందరితోటి నటించింది. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి , వెంకటేష్, నాగార్జున, తదితరులు అందరితో స్క్రీన్ పంచుకుంది.

అయితే శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. ఆ సమయంలో ఎన్టీఆర్ కి మనవరాలు కూడా నటించింది. అయితే తర్వాత హీరోయిన్ గా మారిన సమయంలో శ్రీదేవి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా తీసుకోవాలని దర్శకుడు రాఘవేంద్రరావు అనుకున్నారట. ఎక్కువగా ఎన్టీఆర్ తో సినిమాలు చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కావడంతో ఆయన నిర్ణయాలకు కూడా ఎన్టీఆర్ విలువ ఇచ్చేవారు. అయితే అప్పుడు రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ వద్దకు వెళ్లి ఆమె వయస్సు 16 సంవత్సారాలు అని చెప్పారట. దానికి ఎన్టీఆర్ చమత్కారంగా నా వయస్సు 14 ఏ కదా అని చమత్కారంగా నవ్వారట. తర్వాత ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎంత సంచలన విజయం సాధించాయో తెలిసిందే.

Ads

ప్రస్తుతం రాఘవేంద్రరావు డైరెక్షన్ కు దూరంగా ఉన్నా పలు సినిమాల ప్రమోషన్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.రాఘవేంద్ర రావు వయస్సు 81 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ కోవెలమూడి పలు సినిమాలకు దర్శకత్వం వహించినా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయారు.రాఘవేంద్రరావు శిష్యులలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.రాఘవేంద్రరావు సినిమాలలో ఎన్నో సినిమాలు క్లాసిక్ హిట్లుగా నిలిచాయి.

Previous articleసూర్యకాంతం గారు చివరి రోజుల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ చూశారా..? ఇందులో ఏం మాట్లాడారంటే..?
Next articleహీరో అన్న పదానికి అర్థమే మార్చేసిన గొప్ప నటుడు..! ఇతను ఎవరో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.