అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గురించి ఆసక్తికర విషయాలు..

Ads

అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ ఆస్కార్. ఈ అవార్డును అందుకోవాలని  నటీనటులు కలలు కంటూ ఉంటారు. అయితే ఈ అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. అటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు 95వ ఆస్కార్ వేడుకలు తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరిగాయి.

Ads

ఈ వేడుకల్లో అంతర్జాతీయ దర్శక నిర్మాతలు, నటీ నటులు సందడి చేసారు. ఇక టాలీవుడ్ నుండి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమా నుండి నాటు నాటు సాంగ్ పాటను ఆస్కార్ అవార్డ్ వరించింది. దాంతో భారతీయులందరు సంతోషంలో మునిగిపోయారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది. ఈ నేపద్యంలో ఆస్కార్ అవార్డు విలువ గురించి, దేనితో ఈ అవార్డును తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
ఆస్కార్ అవార్డు, బంగారు రంగులో ఉండే ఒక యోధుడు తన రెండు చేతులతో ఖడ్గం పట్టుకొని ఫిల్మ్ రీలు పై నిలుచుని ఉన్నట్టుగా ఉంటుంది. ఇది ఎంజీఎం స్టూడియో ఆర్ట్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టి. ఇక ఆస్కార్ అవార్డ్ కింది భాగంలో ఉండే ఫిల్మ్ రీలు చుట్టూ ఐదు చువ్వలను కలిగి ఉంటాయి. ఈ చువ్వలు అకాడమీలో 5 కేటగిరీలకు సూచికలు. కెడ్రిక్ గిబ్బన్స్ ఎమిలో ఫెర్నాండెజ్ అనే యాక్టర్ ను నగ్నంగా నిల్చోబెట్టి ఆయన ఆకారంను స్పూర్తిగా తీసుకొని రూపొందించగా, లాస్ ఏంజిల్స్ కి చెందిన జార్జ్ స్టాన్లీ ఈ ప్రతిమని తయారు చేశారు.పసిడి వర్ణంలో కనిపించే ఈ ప్రతిమ బంగారంతో చేసింది కాదు. కాంస్యంతో తయారు చేసి, 24 క్యారెట్ బంగారంతో పూత అద్దుతారు. దీనిని తయారు చేయడానికి దాదాపు 400 డాలర్ల వరకు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఆస్కార్ ప్రతిమ 8.5 పౌండ్లు (450 గ్రాములుకి పైన) బరువు, 13.5 అంగుళాల ఎత్తు  ఉంటుంది. ఈ ప్రతిమ ఆధారంగా షికాగో ఉండే ఓవెన్స్ అండ్ కంపెనీ ప్రతి ఏడాది తయారు చేస్తారు. 50 ఆస్కార్ ప్రతిమలను తయారుచేసేందుకు సుమారు నెల రోజులు పడుతుందట. ఈ అవార్డు అమ్మితే కేవలం ఒక డాలర్ వస్తుందట. అయితే అవార్డులు అమ్మకూడదు అనే రూల్ ఉంది.
ఇక ఈ అవార్డ్ కి  ఆస్కార్ అనే పేరు వెనుక ఒక ప్రచారం జరుగుతోంది. అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తోలిసారి ఈ ప్రతిమను చూసి, ప్రతిమాలోని యోధుడు ఆమె అంకుల్ ఆస్కార్ లా ఉన్నాడని చెప్పిందంట. అంతే కాకుండా హాలీవుడ్ కాలమిస్ట్ తన ఆర్టికల్ లో వీటిని ఆస్కార్ పురస్కారాలని చెప్పారని, అలా ఆస్కార్ అని వాడుకలోకి వచ్చిందంటారు. ఇక మొదటిసారి ఆస్కార్ అవార్డ్ పొందిన యాక్టర్ ఎమిల్ జన్నింగ్స్. ఆయనకు దిలాస్ట్ కమాండ్ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది.

Also Read: ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?

Previous articleఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?
Next articleచాణక్యు నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం బానిస అవుతుంది..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.