మాటాల మాంత్రికుడు ‘త్రివిక్రమ్’ సినిమాల్లో మనకు కనపడే ఈ వ్యక్తి ఎవరు? బ్యాక్ గ్రౌండ్ !

Ads

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందరికీ సుపరిచితమే. త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకి కథ స్క్రీన్ ప్లే రచయితగా పనిచేశారు. ఆ తర్వాత నెమ్మదిగా చక్కని సినిమాలని తెర మీదకి తీసుకువచ్చారు. అతడు, జులాయి, అత్తారింటికి దారేది ఇలా ఎన్నో సినిమాలని ఇప్పటివరకు తెర మీదకి తీసుకువచ్చారు త్రివిక్రమ్ శ్రీనివాస్.

మొదట్లో అవకాశాల కోసం సునీల్ తో పాటుగా ఒకే గదిలో ఉండేవారు త్రివిక్రమ్. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డారు.

1999లో స్వయంవరం సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. స్వయంవరం సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల రచయితగా పని చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో విలువలు ఉంటాయి. సాహిత్యం పై ఉన్న ఆసక్తితో ఆయన సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో టాప్ హీరోలందరు కూడా పనిచేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఎక్కువగా మనకి ఒక వ్యక్తి కనబడుతారు. ఆ వ్యక్తి ఎవరు ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

Ads

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలో ఈయన కనబడతారు ఈయన పేరు పమ్మి సాయి. ఇంచుమించు త్రివిక్రమ్ సినిమాలన్నిటిలో కూడా పంపి సాయి వున్నాడు. అతడు సినిమాలో వెయిటర్ గా కనపడతారు సాయి. జల్సా సినిమాలో కూడా ఒక టిఫిన్ సెంటర్లో పని చేసే వ్యక్తిగా నటించాడు. ఖలేజా సినిమాలో కూడా పమ్మి సాయి ఒక చిన్న సీన్ లో కనపడతాడు.

జులాయి సినిమాలో కూడా అల్లు అర్జున్ ఫ్రెండ్ గా నటించాడు. అత్తారింటికి దారేదిలో కూడా నటించాడు సాయి. అత్తారింటికి దారేది సినిమాలో కోట శ్రీనివాసరావు పక్కన పని వాడి కింద నటించాడు. అఆ సినిమాలో రావు రమేష్ పక్కన చెవిటి వాడిగా నటించాడు. అరవింద సమేత సినిమాలో కూడా కానిస్టేబుల్ కింద నటించాడు ఇలా దాదాపు త్రివిక్రమ్ సినిమాలన్నిటిలో కూడా పమ్మి సాయి ఉంటాడు.

Previous articleఖమ్మం రాహుల్ సభకి భారీగా తరలివచ్చిన ప్రజలు ! కాంగ్రెస్ లో కొత్త జోష్ !
Next articleరాహుల్ గాంధీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు