విడాకులు తీసుకున్నాక భరణం ఇవ్వాలి అంటే… భార్య ఈ సాక్షాలు అన్నీ తప్పకుండా చూపించాలా..? అవేంటంటే..?

Ads

భార్యాభర్తలు ఇద్దరు ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ వైవాహిక జీవితంలో ముందుకు సాగాలని  పెద్దలు చెబుతుంటారు. అయితే కలహాలు రాకుండా ఉండే కాపురం ఉండదు. కొందరు భార్యాభర్తల మధ్య వచ్చే అభిప్రాయ బేధాల వల్ల విడిపోవాలని భావిస్తారు.

భార్యా భర్తల మధ్య బంధం ఏ కారణం వల్ల అయిన తెగిపోవచ్చు. కొన్నిసార్లు కేవలం ఇగో కారణంగా భార్యాభర్తలు విడిపోతుంటారు. గతంలో కన్నా ప్రస్తుత రోజుల్లో విడాకులు తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది. అయితే మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టులో భార్య చూపించాల్సిన సాక్ష్యాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

movie based on four women

భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఒకరినొకరు  గౌరవించుకుంటూ కలిసి ముందుకు వెళ్తే ఆ బంధంలో ఎలాంటి సమస్య ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం చిన్న కారణాలతో వచ్చిన గొడవలు పెద్దగా మారి విడాకులకు దారి తీస్తుంటాయి.ఈ క్రమంలో విడాకులు తీసుకుని భార్యభర్తలు విడిపోయినపుడు కోర్టు భార్యకు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశిస్తాయి.

Ads

భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చి విడిపోయినపుడు, లేదా విడాకుల కేసు కోర్టులో కొనసాగుతున్న సమయంలో  ఎటువంటి ఆదాయం లేని భార్య జీవితాన్ని గడపడం కోసం ఇవ్వవలసిన డబ్బును మెయింటెనెన్స్ అని పిలుస్తారు. భార్య ఆహారం, వసతి, దుస్తులతో పాటుగా వారి పిల్లల చదువు మరియు ఇతర బాగోగులను కూడా భర్త చూసుకోవాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశించినప్పటికి కూడా భర్త ఎలాంటి మెయింటెనెన్స్ ఇవ్వకపోయినట్లయితే సదరు భార్య మెయింటెనెన్స్ పొందడం కోసం కోర్టుకు వెళ్ళవచ్చు. అయితే ఆ సమయంలో కొన్ని ఆధారాలను చూపించాలి.

ఆమె తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నానని, అలాగే భర్త టనను తాను పోషించుకునే స్థితిలో ఉన్నాడనే ఆధారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే తమడి చట్టబద్ధమైన వివాహం అనే చెప్పే సాక్ష్యం, అలాగే ఆమెకు ఎలాంటి ఆదాయ వనరులు లేవని చెప్పే సాక్ష్యం, కోర్టు అడిగిన ఆధారాలు చూపించడం ద్వారా రావలసిన మెయింటెనెన్స్ ని పొందవచ్చు.

 

Previous articleనరేంద్ర మోడీ భార్య గురించి ఈ విషయాలు తెలుసా..? అసలు వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటంటే..?
Next articleచిరంజీవి 10 క్లాస్ సర్టిఫికేట్ చూసారా..? అయన పుట్టిన ప్రదేశం ఏదో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.