“అభిమాని అంటే పెళ్లి చేసుకున్నాను… ఇప్పుడు ఛీ కొడుతోంది..!” అంటూ… భార్యపై “పంచ్ ప్రసాద్” కామెంట్స్..! అసలు విషయం ఏంటంటే..?

Ads

జబర్దస్త్ అనే ఒక షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ వెలుగులోకి వచ్చారు. ఒకే ఒక్క షో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత మంది కమెడియన్స్ ని అందించడం అంటే చిన్న విషయం కాదు. దాదాపు 10 సంవత్సరాల నుండి జబర్దస్త్ షో నడుస్తోంది. ఈ షో ద్వారా ఎంతో మంది నటులు వచ్చారు. అందులో కొంత మంది హీరోలు అయితే, కొంత మంది మాత్రం టాప్ కమెడియన్స్ అయ్యారు. వారిలో కొంత మంది ఇంకా జబర్దస్త్ లో కొనసాగుతున్నారు కూడా.

punch prasad comments on wife

అలాంటి జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన నటుడు ప్రసాద్. పంచ్ ప్రసాద్ పేరుతో ఈ వ్యక్తి పాపులర్ అయ్యారు. పేరుకి తగ్గట్టే పంచ్ లు చాలా బాగా వేస్తారు. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే, కొంత కాలం నుండి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేని కారణంగా షోలో పాల్గొనలేదు. ప్రసాద్ భార్య సునీత అలాంటి సమయంలో ప్రసాద్ కి అండగా నిలిచారు. ప్రసాద్ ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక మగవాడి విజయం వెనక ఆడది ఉంటుంది అనడానికి నిదర్శనంగా నిలిచారు.

punch prasad comments on wife

Ads

ఇదే విషయాన్ని ప్రసాద్ ఇటీవల ఒక షోలో కూడా చెప్పారు. అయితే, ఒకప్పుడు తన అభిమాని అని చెప్పారు అని, ఇప్పుడు తన భార్య తనని ఛీ కొడుతున్నారు అని అన్నారు. దీని వెనుక పెద్ద సీరియస్ కారణం ఏమీ లేదు. వివరాల్లోకి వెళ్తే, ప్రసాద్, జోర్దార్ సుజాత యాంకర్ గా వ్యవహరించే జోర్దార్ పార్టీ విత్ సుజాత అనే ప్రోగ్రాంలో అతిథిగా పాల్గొన్నారు. ఇందులో మాట్లాడుతూ, ప్రసాద్ భార్య సునీత గురించి, ఆమె గొప్పతనం గురించి చెప్పారు.

punch prasad comments on wife

తన అభిమాని అని చెప్పడంతో సునీతని పెళ్లి పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు ప్రసాద్. ఒకప్పుడు సునీత తన కామెడీ చాలా బాగా ఇష్టపడేవారు అని అన్నారు. కానీ ఇప్పుడు తను పంచ్ లు వేస్తే తన భార్య ఛీ కొడుతోంది అని సరదాగా చెప్పారు. తన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడింది అని చెప్పారు. సునీత కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నారు అని, ఒకవేళ తనకి షో ఆఫర్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను అని ప్రసాద్ చెప్పారు. ఇంకా ఈ ప్రోగ్రాంలో ఎన్నో విషయాల గురించి ప్రసాద్ మాట్లాడారు.

watch video :

ALSO READ : పూర్తిగా రూపం మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏమైంది అంటూ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్!

Previous articleపూర్తిగా రూపం మారిపోయిన ఒకప్పటి స్టార్ హీరోయిన్.. ఏమైంది అంటూ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్!
Next article‘ఈ పండగ మనదే’ అంటున్న ఈటీవీ .. తెలుగు నూతన సంవత్సరం ‘ఉగాది’ సందర్భంగా సరికొత్త హంగామా
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.