Ads
ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన చాలా కొద్ది సమయంలోనే తనకంటూ యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ.
గీత గోవిందం లాంటి సినిమాలతో మాస్ యాంగిల్ లోనే కాకుండా క్లాస్ గా కూడా చేయగలను అని నిరూపించుకున్నాడు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మంచిగా మూవీస్ చేసి ఓ రేంజ్ హీరోగా ఎదిగాడు .
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో సపోర్టింగ్ రోల్ లో కనిపించిన విజయ్ అందరి మనసు దోచుకున్నాడు. ఇక ఆ తర్వాత పెళ్లిచూపులు అనే చిత్రంతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని …అర్జున్ రెడ్డి .. గీతా గోవిందం తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే గత కొద్ది కాలంగా అతను కెరియర్లో పలు రకాల డిజాస్టర్ లను ఎదుర్కొంటున్నాడు.
Ads
భారీ అంచనాల మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ చిత్రాలు అతని కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ గా మిగిలాయి. అయితే ఈ రెండు చిత్రాల తర్వాత లేటెస్ట్ గా ఎన్నో హోప్స్ తో ఖుషి చిత్రం విడుదలయింది. సమంత ఇందులో హీరోయిన్ గా నటించడంతో మూవీపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ చిత్రం కూడా డిజాస్టర్ టాక్స్ సొంతం చేసుకుని ,విజయ్ కెరియర్ లో వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్ మూవీ గా మిగిలింది.
ఓవర్సీస్ లో వసూళ్లు బాగానే ఉన్నప్పటికీ…తెలుగు రాష్ట్రాలలో మాత్రం భయంకరంగా ఈ మూవీ టాక్ పడిపోయింది. మూవీకి ముందే అనవసరమైన హైప్ ఇవ్వడమే ఈ చిత్రం డిజాస్టర్ కి కారణం అన్న టాక్ కూడా ఉంది. ఇంతకుముందు డిజాస్టర్ అయిన వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ మూవీస్ విషయంలో కూడా ఇదే రకమైన భయంకరమైన ప్రచారం జరిగింది.. ఖుషి మూవీకి కూడా అదే బాటలో ఫ్లాప్ అయింది అని కొందరు భావిస్తున్నారు.