ఆ హిట్ సినిమాలో ఈమె హీరోయిన్… ఇప్పుడేమో ఏకంగా లాయర్ అయిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా?

Ads

ఈ ఫొటోలో అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పక్కన ఫ్రెండ్ గా నటించారు. ఆ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఆ తరువాత ఓ టాలీవుడ్ సినిమాలో హీరోయిన్ గా నటించారు. అయితే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బాగా పాపులారిటీ లభించినప్పటికీ సినిమాల్లో అవకాశాలు మాత్రం రాలేదు. దీనితో ఆమె చదువు పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆమె లాయర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా. ఆమె పేరే రేష్మా రాథోర్.

వెంకటేష్ “బాడీ గార్డ్” సినిమాలో హీరోయిన్ త్రిష పక్కన ఆమె ఫ్రెండ్ గా కనిపించారు. ఆ తరువాత ఆమె “ఈరోజుల్లో” సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ, ఈ సినిమా తరువాత ఆమెకు మరే ఇతర సినిమాల్లోనూ అవకాశాలు రాలేదు. హీరోయిన్ గా తొలి సినిమాతోనే సక్సెస్ అయినప్పటికీ.. తరువాత అవకాశాలు రాకపోవడంతో ఆమె తెరమరుగు అయ్యారు.

ఈరోజుల్లో సినిమా తరువాత జీలకర్ర బెల్లం, అప్పవుమ్ వీంజుమ్(మలయాళ), అదగపట్టత్తు మగజననంగలయ్(తమిళ), లవ్ సైకిల్, ప్రతిఘటన, జై శ్రీరామ్ సినిమాల్లో కూడా ఆమె నటించారు. కానీ, ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. దీనితో ఆమె 2017 తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయ్యారు. ఆ తరువాత ఆమె రాజకీయాలలోకి ఎంటర్ అయ్యారు.

బిజెపి పార్టీలో చేరి ఓ వైపు రాజాకీయాలలో కొనసాగుతూనే.. మరోవైపు లాయర్ చదువుని కూడా కొనసాగించారు. నటిగా పెద్దగా పేరు రాకున్నా.. రేష్మా లాయర్ గా తన సత్తా చాటుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ లాయర్ గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆమె రూపు రేఖలలో చాలా మార్పులు వచ్చాయి. దానితో.. ఆమెను నెటిజన్స్ వెంటనే గుర్తు పట్టలేకపోయారు. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూసేయండి.

Previous articleHappy Ganesh Chaturthi Wishes : Vinayaka Chavithi Images in Telugu 2023
Next articleకాలి బొటన వేలు ఇలా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.