50 ఏళ్లకు చేరువవుతున్నా తగ్గని అందం… ఈ చిరు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Ads

ఈ ఫొటోలో హీరోయిన్ ను చూసారా? ఎక్కడో చూసినట్లు అనిపిస్తోందా..? ఎక్కడ ఎక్కడ.. ఎక్కడ ఉందో తారక..గుర్తొచ్చిందా? మురారి సినిమాతో పరిచయం అయ్యి తెలుగువాళ్ళ గుండెల్లో నిలిచిపోయిన హీరోయిన్ సోనాలి బింద్రే. కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మురారి సినిమాతో సోనాలి బింద్రే పరిచయం అయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో సోనాలి బింద్రే పాపులర్ అయ్యారు. సోనాలి బింద్రే బాలీవుడ్ నటి. ఆమెకు తెలుగు లో కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువే ఉంది.

మురారి తరువాత ఇంద్ర సినిమాలో చిరు సరసన నటించి మెప్పించారు. ఆ తరువాత శంకర్ దాదా ఎంబిబిఎస్ లోనూ నటించారు. 2013 తర్వాత నుంచి సోనాలి బింద్రే సినిమాల్లో పెద్దగా నటించలేదు. సినిమాల్లో నటించకపోయినా ఈ భామ సోషల్ మీడియాలో ఆక్టివ్ గానే ఉంటారు. తన అభిమానులతో తరచూ టచ్ లోనే ఉంటూ ఉంటారు. 1975 జనవరి 1న జన్మించిన సోనాలి బింద్రే ముంబై లోను, బెంగుళూరు లోను తన చదువుని కొనసాగించారు. సోనాలి బింద్రే తండ్రి సివిల్ సర్వెంట్ గా పని చేసారు.

Ads

చదువుకునే రోజుల్లోనే సోనాలి బింద్రే మోడలింగ్ వైపు అడుగులు వేశారు. ‘ఆగ్’ సినిమాతో సోనాలి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తోనే ఆమె ఫిలిం ఫెర్ అవార్డు ని కూడా అందుకున్నారు. చిరు, మహేష్ ల తర్వాత బాలకృష్ణతో ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమాలో కూడా సోనాలి నటించారు. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. కృష్ణవంశీ ఖడ్గం సినిమాలో మరోసారి మెరిచారు.

ఈ సినిమాలో సోనాలి నటనకి, అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆమె యాభై ఏళ్ల వయసుకు చేరువలో ఉన్నారు. అయినప్పటికీ ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదు. కాన్సర్ తో పోరాడి విజయం సాధించారు ఆమె. తాజాగా, ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Previous article“సమంత” చేస్తే తప్పు పడుతున్నారు…మరి నాగ చైతన్య అలాగే చేసినప్పుడు ఎందుకు సైలెంట్ ఉన్నారు.?
Next article“బిగ్‌బాస్ తెలుగు-7” లాంచ్ ఎపిసోడ్‌పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.