నటి షాలినీ డైవర్స్‌ వెనుక ఇంత విషాదం ఉందా..? అందుకే అలా..!

Ads

నటి షాలినీ కి విడాకులు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె విడాకుల ఫోటోషూట్ ని కూడా ఏర్పాటు చేసుకుంది. ఆ విడాకుల ఫోటోషూట్ కి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పైగా విడాకులకి ఫోటోషూట్ చేయడం ఎంతవరకు మంచిది అనే దాని మీద కూడా చర్చ జోరుగా సాగుతోంది. తమిళ నటి షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆమె అందరికీ సుపరిచితమే.

భర్త నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె ఘనంగా విడాకుల ఫోటోషూట్ ని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఫోటోలని సోషల్ మీడియా అకౌంట్లో కూడా షేర్ చేసుకున్నారు. అది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది తిడుతూ ఉంటే మరి కొంతమంది ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఆమె అలా ఫోటోషూట్ ని చేయడం వెనక పెద్ద కారణమే ఉంది.

నాలుగేళ్ల పాటు తన భర్తతో ఆమె నరకం అనుభవించారు. చివరికి భర్త నుండి విడిపోయారు. అనేళ్ల పాటు ఆమె ఎంతో కష్టపడ్డారు. ఆ ఫోటోషూట్ ని చేసుకుని ఆ కష్టం అంతటినీ మరిచిపోయారని తెలుస్తోంది. ఇక ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ.. దుబాయ్ లో ఉంటున్నాను. దుబాయ్ లో ఉంటానని ఫ్రెండ్స్ అంతా అంటారు.

Ads

నా భర్త నన్ను కొట్టినప్పుడు నేను పార్కింగ్ లోకి వెళ్లి పడుకునేదాన్ని అప్పటికి గొడవని ఆపేస్తే చాలని అనుకునేదాన్ని. ఏం చేయాలో తెలీదు. ఒకవేళ పోలీసుల దగ్గరికి వెళ్తే తన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే నేను అప్పటికప్పుడు అలా అడ్జస్ట్ అయిపోయేదాన్ని. కింద పార్కింగ్ లోనే నిద్రపోయేదాన్ని. తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్లే దాన్ని అని చెప్పుకొచ్చింది షాలిని.

2019 వరకు నాలుగేళ్లు దెబ్బలు తిన్నాను ఇన్నాళ్లు తిన్న దెబ్బలు అన్ని కూడా ఆ రోజున ఇచ్చాను. అతన్ని కొట్టాను. పిల్లల కోసం మర్యాద ఇస్తూ వచ్చాను పిల్లలు ఏడుస్తున్నా కూడా వాళ్ల ముందు నా భర్త నన్ను కొట్టారు. ఇకపై అలాంటి తండ్రి అవసరం లేదనిపించి అతన్ని కొట్టాను అని చెప్పుకొచ్చారు. అయితే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమని తన భర్త అన్నారట. కానీ ధైర్యంగా నేను బయటకు వెళ్లడం కుదరదు. సింగిల్ అయితే సూట్ కేసు పట్టుకుని బయటకు వెళ్లిపోయే దాన్ని.. ఇప్పుడు వెళ్లడం కుదరదు నువ్వే వెళ్ళిపో అని చెప్పాను అని అన్నారు ఆమె.

Previous articleమీ శరీరం లోని ఈ 7 భాగాలని ప్రెస్ చేసి చూడండి.. అద్భుతం జరుగుతుంది..!
Next articleతాతకు తగ్గ మనవరాలు… వ్యాపారంలో రాణిస్తూ..ఫ్యామిలీ కీర్తిని పెంచుతూ.. శభాష్ నారా బ్రాహ్మణి ..!