భర్తకు అన్నం వడ్డిస్తున్న ఓ భార్య అందం చూసి ఆ రాజు మోహించాడు…ఆఖరికి ఆమె ఎలా బుద్ధి చెప్పిందంటే..?

Ads

భార్యాభర్తల కి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. అలానే ప్రేమానురాగాలు పెంపొందించుకోవడానికి చూసుకోవాలి తప్ప వాళ్ల మధ్య గొడవలకి దారి ఇవ్వకూడదు. మన పురాణాల్లో భార్యా భర్తల బంధానికి విలువని ఇచ్చే కథలు చాలా ఉన్నాయి. ఒక స్త్రీ కి వివాహం అయిన తర్వాత ఆమె ని తల్లిలా గౌరవించాలని ఎన్నో కథలు మనకి నీతిని బోధిస్తున్నాయి.

వివాహం అయిన తర్వాత ఒక సారి స్త్రీ పై కామం మొహం తగదు. ఈరోజుల్లో చాలా మంది నీతి న్యాయం వంటివి మర్చిపోతున్నారు. వావి వరసలని కూడా మరిచిపోయి అక్రమ సంబంధాలను పెట్టుకుంటున్నారు. అయితే వివాహం అయిన తర్వాత స్త్రీ ఏ విధంగా ఉండాలని చెప్పిన ఒక కథ గురించి ఈరోజు మనం చూద్దాం…

ఒక రాజు వేటకు వెళ్ళాడు. అయితే అతను మధ్యలో అలసిపోయాడు. దానితో ఆ అడవికి దగ్గర వున్నా ఒక గ్రామానికి వెళ్లి ఒక ఇంటి ముందు ఆగాడు. అక్కడ ఇంట్లో స్త్రీ తన భర్త కు భోజనం వడ్డిస్తోంది. దాన్ని చూసాడు. ఆమె చూస్తే చాలా అందముగా వుంది. దానితో ఆ రాజు స్థాణువైపోయాడు. ఇంతలో అక్కడ తన భర్త తిని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆమె కూడా తలుపులు మూసి లోపలకి వెళ్ళిపోనుంది.

Ads

ఆ సమయం లో రాజు అక్కడకు వెళ్లి తలుపు కొట్టగా.. ఆమె తలుపు తీసింది. రాజు లోపలకి వచ్చి కూర్చున్నాడు. తాను ఎవరు అనేది చెప్పాడు. ఈ రాజ్యానికి రాజునని చెప్పి నువ్ చాలా అందంగా ఉన్నావు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అని చెప్పాడు. ఆమె అది విని ఆశ్చర్య పోయి నాకు ఇంతకు ముందే పెళ్లి అయ్యింది అని చెప్పింది. కానీ అతను ఏమీ వినలేదు.

ఆమె ఎంతో గుణవంతురాలు. సంస్కారం వున్న స్త్రీ. అయితే ఏం చెప్తే ఏం అంటాడు రాజు అని భయ పడుతోంది. ఆ తరవాత ఆమె మీరు ముందు భోజనం చేయండి. అలసిపోయారేమో తినండి అంటుంది. తన భర్త భోజనం చేసిన ఎంగిలి ఆకు వైపు చూపించి తినమని అంటుంది. అది చూసి ఆగ్రహానికి గురయ్యాడు రాజు.

నీ భర్త తిన్న ఎంగిలి ఆకులో నేను తినాలా అని కోప్పడతాడు. అప్పుడు ఆమె రాజా మీరు శాంతించండి. నా భర్త తిన్న ఆకులో భోజనం చేసేందుకు అడ్డు వచ్చిన ఎంగిలి ఆయన సొంతం అయినా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి మీకు ఏమి అడ్డు రాలేదా…? అంటూ ఆమె ప్రశ్నించింది. రాజుకి అర్ధం అయ్యి వెళ్ళిపోయాడు.

Previous articleఅల్లు అర్జున్ కి, స్నేహకి మధ్యలో ఎన్ని సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..? స్నేహ వయసు ఎంతంటే..?
Next articleJr Ntr: ఎన్టీఆర్ ఇద్దరి పిల్లల స్కూల్ ఫీజు ఎంతో తెలుసా..? తెలిస్తే దిమ్మ తిరిగిపోతుందంతే!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.