మొదటి సినిమాకి అందరూ ట్రోల్ చేశారు… 7 సంవత్సరాల తర్వాత వచ్చి దేశంలోనే గొప్ప హీరో అయ్యాడు..! ఇతను ఎవరంటే..?

Ads

సినిమా ఇండస్ట్రీలోకి రావడం అనేది ఎన్నో సంవత్సరాలు ప్రయత్నం చేస్తే జరిగే విషయం. అది కూడా చిన్న చిన్న ఉద్యోగాలతో మొదలు పెట్టి, తర్వాత పెద్ద స్థాయికి వెళ్తారు. అలా ఇప్పుడు ఎంతో మంది హీరోలు, గతంలో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిన్న చిన్న పనులు చేశారు. ఇదంతా సినీ నేపథ్యం లేని వారి సంగతి. మరి సినీ నేపథ్యం ఉన్న వారి సంగతి? వాళ్లు కూడా ఇలాగే కాకపోయినా, మరొక రకంగా కష్టాలు పడతారు. వారసత్వంతో ఇండస్ట్రీలోకి వస్తే, వారి సినిమా ఫలితాలు కాస్త అటు ఇటు అయితే, కుటుంబం పేరుని నిలబెట్టలేదు అంటూ కామెంట్స్ చేయడం మొదలు పెడతారు.

this hero became famous

అలా మొదటి సినిమాతోనే ఒక హీరో ప్రేక్షకులని నిరాశపరిచారు. తండ్రి భారత దేశ వ్యాప్తంగా గర్వించదగ్గ డైరెక్టర్. అలాంటి కుటుంబం నుండి వచ్చినప్పుడు అతని మీద అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మొదటి సినిమాలో తన యాక్టింగ్ బాలేదు అంటూ కామెంట్స్ ఎదుర్కొన్నారు. ఎంతో మంది ట్రోల్ చేశారు. దాంతో బాధలోకి వెళ్లిపోయి. 7 సంవత్సరాలు గ్యాప్ తీసుకుని, మళ్లీ సినిమాల్లోకి వచ్చి హిట్ కొట్టారు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ గొప్ప నటుడు అయ్యారు. ఇవన్నీ నటుడు ఫహాద్ ఫాజిల్ కి జరిగాయి అంటే ఎవరు నమ్మరు. కానీ ఇది నిజం. ఆయన జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నారు. సినీ నేపథ్యంతో వచ్చినా కూడా ఆయన ప్రయాణం అంత సులువుగా సాగలేదు.

 

ఫహద్ ఫాజిల్ తనకి 20 సంవత్సరాలు ఉన్నప్పుడు 2002 లో కైయెతుమ్ దూరత్ అనే సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు. ఈ సినిమాకి ఆయన తండ్రి ఫాజిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ నికిత హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి ఫహద్ ఫాజిల్ పేరు షాను అని పడింది. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. చూడడానికి బాగున్నా కూడా డాన్స్ రాదు అని రకరకాల కామెంట్స్ వచ్చాయి. అందుకు ఫహద్ ఫాజిల్ బాధ్యత వహించి, తన తండ్రిని ఈ సినిమా ఫ్లాప్ అయినందుకు ఏమీ అనద్దు అని, యాక్టింగ్ గురించి ప్రిపరేషన్ లేకుండా రావడం అనేది తన తప్పు అని అన్నారు. ఆ తర్వాత దాదాపు 5 సంవత్సరాలు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్ళిపోయి చదువుకున్నారు.

Ads

 

2009 లో కేరళ కేఫ్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత 22 ఫిమేల్ కొట్టాయం అనే సినిమాలో విలన్ పాత్రలో నటించారు. ఇదే సినిమా తెలుగులో మాలిని 22 పేరుతో కూడా రూపొందింది. తెలుగులో ఈ సినిమాలో నిత్యా మీనన్ నటించారు. మలయాళంలో ఫహద్ ఫాజిల్ హీరో పాత్ర పోషించారు. మొదట హీరోయిన్ ని నమ్మించి, ఆ తర్వాత ఆమెని సమస్యల్లోకి తోసే పాత్ర అది. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వచ్చారు. 2013 లో సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి దర్శకుడిగా తీసిన మొదటి సినిమా అయిన అన్నయుమ్ రసూలుమ్ సినిమాతో గుర్తింపు ఇంకా పెరిగింది. ఆ తర్వాత ఎన్నో అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ లు చేశారు.

 

ఇప్పుడు పుష్ప సినిమాతో తెలుగులో కూడా నటిస్తున్నారు. ఇటీవల ఆవేశం సినిమాతో సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా 100 కోట్లు వసూలుకి దగ్గరగా ఉంది. ఫహద్ ఫాజిల్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా, ముఖ్య పాత్రలో కూడా నటిస్తారు. కుంబలంగి నైట్స్ అనే సినిమాలో ఫహద్ ఫాజిల్ పోషించిన పాత్రకి ఎన్నో ప్రశంసలు దక్కాయి. అలాగే ఎన్నో సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇటీవల ఇంకొక ఇద్దరు నిర్మాతలతో కలిసి ప్రేమలు సినిమాని నిర్మించారు. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేసింది. అలా హీరోగా, నిర్మాతగా ఈ సంవత్సరం 100 కోట్లు సాధించారు. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ పుష్ప-2 తో పాటు, రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టయన్ సినిమాలో కూడా నటిస్తున్నారు.

ALSO READ : విజయ్ దేవరకొండకి ఒక ఇంటర్ విద్యార్థి తండ్రి రాసిన లెటర్..! ఇందులో ఏం రాశారంటే..?

Previous articleవిజయ్ దేవరకొండకి ఒక ఇంటర్ విద్యార్థి తండ్రి రాసిన లెటర్..! ఇందులో ఏం రాశారంటే..?
Next articleపెద్ద కూతురికి శ్రీదేవి రాసిన ఉత్తరం..! ఇందులో ఏం ఉందంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.