OTT లోకి వచ్చిన టోవినో థామస్ కొత్త సినిమా..! ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

Ads

మలయాళం సినిమాల ద్వారా తెలుగులో గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో టోవినో థామస్. టోవినో థామస్ కి తెలుగులో చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన నటించిన సినిమాలు అన్నీ కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు టోవినో థామస్ నటించిన కల్కి అనే సినిమా ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. ప్రవీణ్ ప్రభారామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శివాజిత్ పద్మనాభన్, సుధీష్, సంయుక్త కూడా నటించారు. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా పెద్ద హైలైట్ అయ్యింది.

tovino thomas kalki review telugu

Ads

ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నంజన్ కోట్టైలో అమర్నాథ్ (శివజిత్ పద్మనాభన్) పెత్తనం చలాయిస్తూ ఉంటాడు. అక్కడికి కల్కి (టోవినో థామస్) పోలీస్ ఆఫీసర్ గా వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే సినిమా స్పందన ఇంకా బాగుండేది. కానీ ఈ సినిమాలో టోవినో థామస్ కి మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి. నటన విషయంలో కానీ, ఆహార్యం విషయంలో కానీ ఆయన తీసుకున్న జాగ్రత్తలు తెలుస్తాయి.

సినిమా కోసం తనని తాను మార్చుకున్నారు. సినిమా చూస్తున్నంత సేపు అక్కడ ఉన్న వ్యక్తి టోవినో థామస్ అనే విషయం ఎవరికీ గుర్తు రాదు. మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు చేశారు. సినిమా అంతా ఒకటే ప్రాంతంలో నడుస్తుంది. యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రేమ కథలు, కామెడీ ట్రాక్ లు వంటివి ఈ సినిమాలో ఉండదు. యాక్షన్ సీన్స్ చాలా బాగా తెరకెక్కించారు. డిజైన్ చేసిన విధానం కూడా బాగుంది. ఈ సినిమా చాలా సీరియస్ గా నడుస్తుంది. అలాంటి సినిమాలు ఇష్టపడే వారు ఈ సినిమా అని అస్సలు మిస్ అవ్వకండి.

Previous articleLove Mouli Review : “నవదీప్” చేసిన ఈ కొత్త ప్రయత్నం ఫలించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయిని అమ్మాయిలు అస్సలు పెళ్లి చేసుకోరు..! ఇంతకీ అవేంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.