ఈ కోడి మాంసం కిలో రూ.900…దీని స్పెషల్ ఏమిటి అంటే..?

Ads

చాలా మంది మాంసాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆదివారం ఎక్కువగా చాలా మంది మాంసాహారాన్ని తింటూ ఉంటారు. అయితే సాధారణంగా కోడి గుడ్డు అయిదు రూపాయలు ఉంటుంది కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ కోడి గుడ్డు మాత్రం 50 రూపాయలు ఉంటుంది. గుడ్డు మాత్రమే ఇంత ఖరీదు అనుకోకండి దీన్ని మాంసం, అప్పుడే పుట్టిన కోడి పిల్ల ఖరీదు కూడా ఎక్కువే. అయితే ఎందుకు ఇక్కడ కిలో మాంసం 900 రూపాయలు ఉంటుంది..? దాని స్పెషల్ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్ కి చెందిన ఈ కోడి గుడ్డు ధర 50 రూపాయలు. ఈ కోడి పిల్ల ఖరీదు వచ్చేసి 150 రూపాయలు. మన ఇండియాలోనే అత్యంత డిమాండ్ ఉన్న కోడి ఇది. ఇక ఈ కోడి మాంసం అయితే కిలో తొమ్మిది వందల రూపాయల వరకు ఉంటుంది. ఇక మరి దీని స్పెషాలిటీ ఏంటి ఎందుకు అంత ధర అనే విషయాన్ని చూద్దాం..

Ads

ఈ కోడి జాతి పేరు క‌డ‌క్‌నాథ్. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినది ఈ కోడి జాతి. దీన్ని తీసుకోవడం వలన అనేక రోగాల‌ను తగ్గించుకోవచ్చు. ఈ కోడి మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అరుదైన ఔషధ లక్షణాలు సైతం ఈ కోడి లో వున్నాయి. ఈ కోళ్ళని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో కాలి-మాసి ( న‌ల్ల‌దైన మాంసం క‌ల‌ది) అని పిలుచుకుంటారు. ఈ చికెన్‌ కలర్‌ నల్లగా ఉంటుంది. కూర వండినా కూడా వాటి ముక్కలు నల్లగానే ఉంటాయి. రంగు మారదు.

ముదురు నలుపు లో ఇది ఉంటుంది. పైగా ఈ కోడి వెంట్రుకలు, చర్మం, మాంసం అలానే రక్తం కూడా నల్లగానే ఉంటుంది. ఈ కోడి వేసవిలో 100 గుడ్లు పెడుతుంది. ఏడు నెలల్లో 1.5 కేజీల బరువు మాత్రమే పెరుగుతుంది. జీర్ణ శక్తి, రోగ నిరోధక శక్తులు ఈ కోడి మాంసం తీసుకుంటే పెరుగుతాయి. ఈ కోళ్ల మాంసంలో కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది. దీనిలో మాంస‌కృత్తులు ఎక్కువుంటాయి. మెడిసిన్స్ లో దీన్ని వాడతారు.

Previous articleహనుమంతుని తోక కి గంట ఉండడం వెనుక.. రహస్యం ఏమిటో మీకు తెలుసా..?
Next articleఈ 5 రాశుల వాళ్ళు.. ఎట్టిపరిస్థితుల్లో లవ్ చేసిన వాళ్ళని వదులుకోరు..!