Ads
2004 లో విడుదల అయిన 7 జి బృందావన్ కాలనీ సినిమా గుర్తుందా? అప్పట్లో కుర్రకారుని ఈ సినిమా ఓ ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ సినిమా టెంప్లేట్ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉంటాయి. ఈ సినిమాను టాప్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాలో రవికృష్ణ హీరో గా నటించగా, సోనియా అగర్వాల్ హీరోయిన్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే.. ఈ సినిమా తరువాత రవి కృష్ణ పెద్దగా క్లిక్ కాలేదు.
“7 జి బృందావన్ కాలనీ” సూపర్ సక్సెస్ అవడంతో హీరో రవి కృష్ణకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. ఈ సినిమాతో రవిక్రిష్ణకు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు కూడా వచ్చింది. కానీ, సరిగ్గా సినిమాలు ఎంచుకోవడంలో రవి కృష్ణ విఫలం అయ్యారు. దానితో ఆయన సినిమాలు ఫ్లాప్ అవ్వడమే కాకుండా తరువాత అవకాశాలు కూడా రాలేదు. తన సినిమా కెరీర్ లో రవి కృష్ణ ఎనిమిది సినిమాలలో నటించారు. కానీ వాటిల్లో, “7 జి బృందావన్ కాలనీ” సినిమా తప్ప మరే ఇతర సినిమా హిట్ అవ్వలేదు.
Ads
అవకాశాలు తగ్గడంతో రవి కృష్ణ ఎక్కువగా ఇంటిదగ్గరే టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా రవికృష్ణ, సోనియా అగర్వాల్ తీసుకున్న ఫోటో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి “7 జి బృందావన్ కాలనీ” సినిమా సీక్వెల్ లో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో నటించడం కోసం రవి కృష్ణ బరువు తగ్గి ఫిట్ అవుతున్నారని తెలుస్తోంది. “7 జి బృందావన్ కాలనీ” సినిమా అభిమానులు మాత్రం ఈ సినిమా సీక్వెల్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు.