ఈ సీరియల్ మీలో ఎంత మందికి గుర్తుంది..? దీని పేరేంటో చెప్పగలరా..?

Ads

ఎంతో మందికి తమ రోజువారి జీవితంలో భాగమైపోయాయి సీరియల్స్. తెలుగు సీరియల్స్ కి ఎంతో అభిమానం ఉంటుంది. తెలుగు సీరియల్స్ లో నటించేవారిని వారి సొంత ఇళ్ళల్లో వారిగా చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పుడు సీరియల్స్ కాన్సెప్ట్ మారింది కానీ గతంలో చాలా మంచి కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ వచ్చేవి. అంటే, ఇప్పటి సీరియల్స్ లో డ్రామా ఎక్కువగా ఉంటుంది. అత్త కోడళ్ళు, లేదా హీరోయిన్ ఒక ఇంట్లోకి వెళ్తే అక్కడ ఆమె నచ్చని వారు ఉండడం ఇలాంటి కాన్సెప్ట్ మీద ఇప్పుడు సీరియల్స్ ఎక్కువగా వస్తున్నాయి.

do you remember this serial

కానీ గతంలో అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సీరియల్స్ చాలా అంటే చాలా తక్కువగా వచ్చేవి. ఈటీవీలో అయితే చాలా డిఫరెంట్ స్టోరీ ఉన్న సీరియల్స్ తీసుకొచ్చేవాళ్ళు. కామెడీ సీరియల్స్ కూడా ఎక్కువగా వచ్చేవి. అందులో ఈ సీరియల్ కూడా ఒకటి. ఈ పైన ఉన్న ఫోటో ఈటీవీలో వచ్చే ఒక సీరియల్ లోనిది. ఈ సీరియల్ అప్పట్లో చాలా ఫేమస్. ఒక సినిమా ద్వారా ఆ తర్వాత మళ్లీ ఫేమస్ అయ్యింది. లేడీ డిటెక్టివ్. అమ్మో యమ యాక్టివ్. ఇది చదువుతుంటే మీలో చాలా మందికి ఈ పాట ట్యూన్ వినిపిస్తూ ఉంటుంది. అంత ఫేమస్ ఈ సీరియల్.

Ads

ఈ సీరియల్ తో పాటు ఈ సీరియల్ ట్యూన్ ఇంకా ఫేమస్. టైటిల్ సాంగ్ కి కూడా చాలా మంది అభిమానులు ఉండేవారు. ఒక అమ్మాయి డిటెక్టివ్ అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సీరియల్ లో చూపించారు. కామెడీతో పాటు, కొన్ని సీరియస్ విషయాల మీద కూడా ఈ సీరియల్ నడిచేది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో ఈ సీరియల్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ఒక డిలీటెడ్ సీన్ ఉంటుంది. అందులో హీరోయిన్, హీరోకి జూనియర్. ఒకసారి హీరోయిన్ ని, హీరో పాట పాడమని అడిగితే, ఆమె లేడీ డిటెక్టివ్ పాట పాడుతుంది. అందుకే హీరో ఆమెని తన డిటెక్టివ్ ఏజెన్సీలో చేర్చుకుంటాడు. దాంతో, ఈ సీరియల్ మళ్లీ ఫేమస్ అయ్యింది. ఇప్పటికి కూడా ఈ సీరియల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు.

Previous article7/G బృందావన్ కాలనీ హీరో “ఇలియానా” తో నటించారు అని తెలుసా..? ఈ సినిమా పేరు ఏంటంటే..?
Next articleమనమే సెన్సార్ రిపోర్ట్..! సినిమా చూసి ఏం చెప్పారంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.