Ads
వాల్తేరు వీరయ్య రూపంలో కెరియర్ లో రెండవసారి మంచి బూస్టర్ అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా విడుదలైన భోళాశంకర్ చిత్రం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది. మెహర్ రమేష్ డైరెక్షన్ అనగానే ఈ మూవీ ఫట్ అని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మెగాస్టార్ మ్యాజిక్ కాస్తయినా వర్క్ అవుట్ అవ్వకుండా పోతుందా అన్న బ్రహ్మతో చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
మంచి లాంగ్ వీకెండ్ చూసుకొని విడుదలైన చిత్రం కలెక్షన్స్ పరంగా కాస్త తడబడుతూనే ఉంది. చిరంజీవి సినీ కెరియర్ లోనే అత్యంత బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఈ చిత్రం ఒకటి అని మెగా అభిమానులే తేల్చి చెప్తున్నారు. నేటిజన్స్ అయితే ఈ చిత్రాన్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మెగాస్టార్ ఇచ్చిన మంచి ఆఫర్ ని మెహర్ రమేష్ యూస్ చేసుకోవడంలో విఫలమయ్యాడు అని నేటిజన్స్ విమర్శిస్తున్నారు.
Ads
అంతేకాదు కథల విషయంలో మార్పు రావాలి అని డైరెక్ట్ గా చిరంజీవికే అభిమానులు లేఖ రాస్తున్నారు. ఈ మూవీలో ఊహించిన విధంగా ఎటువంటి ట్విస్టులు లేవు.. స్టోరీ కూడా ఎంతో సింపుల్ గా అసలు చిరంజీవికి సెట్ అవ్వని విధంగా ఉంది. దీంతోపాటుగా ఇకనైనా చిరంజీవి రీమిక్స్ సినిమాలకు దూరంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
భోళా శంకర్ చిత్రం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న హల్ చల్ మధ్యలో ఓ కొత్త వార్త వైరల్ అయింది. మొదట ఈ సినిమా లో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబుని అనుకున్నారట. కానీ కొన్ని కారణాలవల్ల మహేష్ ఈ సినిమాని సింపుల్గా రిజెక్ట్ చేయడం జరిగింది. చిరంజీవి కూడా మహేష్ బాబు లాగా చేసి ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేమీ అని కొందరు సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.