ప్రసన్న వదనం క్లైమాక్స్ లో ఇలా ఎందుకు పెట్టారు..? దాని లాజిక్ ఇదేనా..?

Ads

సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. థియేటర్లలో ఈ సినిమాని మిస్ అయినవారు ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో క్లైమాక్స్ మీద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్ అర్థం కాకుండా ముగుస్తుంది. సూర్య అమృతని ఎవరు చంపారో అర్థం చేసుకొని వాళ్ళ మీదే గన్ పెడతాడు. అక్కడి వరకు బాగానే ఉంటుంది.

కానీ తర్వాత అమృతకి సంబంధించిన కొన్ని షాట్స్ ఇందులో చూపిస్తారు. అలా చూపించే సినిమా ఎండ్ చేస్తారు. దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో చాలా మందికి అర్థం కాలేదు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ ప్రకారం సూర్య అమృత అని ముందే చూసాడు. ఎందుకంటే సూర్యకి తనకి ప్రమాదం జరగకముందు మాత్రమే ముఖాలు క్లియర్ గా కనిపించేవి.

Ads

సినిమా చివరిలో అమృత ముఖం సూర్యకి క్లియర్ గా కనిపించినట్టు చూపిస్తారు. ఈ లెక్క ప్రకారం సూర్య అమృతని ముందే చూసాడు. అంతేకాకుండా తర్వాత కూడా సూర్య అమృతం చాలాసార్లు చూశాడు. ఇది మనకి అర్థం అయ్యేలాగా చెప్పడానికే చివరిలో అమృత వాటర్ బాటిల్ పట్టుకొని  నడుస్తున్న షాట్ చూపించారు.

అది కూడా అమృత అంతకుముందు కనిపించిన డ్రెస్ లో కాకుండా, వేరే డ్రెస్ లో కనిపిస్తుంది. అంటే సూర్య అమృతని ముందే చూసాడు అని చెప్పడానికి ఇలా చూపించారు. ఈ లాజిక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం కామెంట్స్ లో ఉంది.

Previous articleOTT లోకి వచ్చేసిన అల్లరి నరేష్ కొత్త సినిమా..! ఎలా ఉందంటే..?
Next articleలంకను చేరుకోడానికి స‌ముద్రంపై వంతెనని.. వానరసేన ఎన్నిరోజులులో కట్టారో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.